
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై కేంద్రం దృష్టి సారించింది. కంపెనీ పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే చెప్పారు. అయితే, కంపెనీ ఆర్థిక ఆడిటింగ్‌ను నిర్వహించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడాన్ని కూడా జెట్ ఎయిర్‌వేస్ వాయిదా వేసిన నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగుల తగ్గింపు తదితర అంశాల గురించి జెట్ ఎయిర్‌వేస్ తమను సంప్రదించటం వంటివేమీ చేయలేదని చౌబే చెప్పారు. ఈ నెల 2 నుంచి ఇప్పటిదాకా జెట్ ఎయిర్‌వేస్ షేరు సుమారు 12% పైగా క్షీణించింది. శుక్రవారం ఇంట్రాడేలో 52 వారాల కనిష్ట స్థాయి రూ.258ని కూడా తాకింది.
Comments
Please login to add a commentAdd a comment