
తిరుపతి క్రైం: ఆర్థిక సమస్యల పేరుతో భార్య, కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేశాడు ఓ కసాయి వ్యక్తి. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపో యాడు. అలిపిరి సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని హస్తినాపురానికి చెందిన ఎం.శ్రీనివాసులు(36), ఎం.సునీత(33) దంపతులకు లక్ష్మీసాయి(8) అనే కుమార్తె ఉంది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్యభర్తలు బిడ్డతో కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 12న తిరుపతిలోని టీటీడీ వసతి గృహమైన శ్రీనివాసంలో రూం అద్దెకు తీసుకుని జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించారు. 15న తిరుమల బైపాస్ రోడ్డులోని హోటల్ విహాస్ ఇన్‌లో రూంను అద్దెకు తీసుకున్నారు. 18న రాత్రి శ్రీనివాసులు నిద్రమాత్రలు తీసుకొచ్చి, ముందుగా భార్య, కూతురుచే మింగించాడు. నిద్రమాత్రల ప్రభావంతో భార్య, కుమార్తె మృతిచెందగా, ఒక రోజంతా అలాగే ఉన్న శ్రీనివాసులు శుక్రవారం అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment