మరియమ్మ, శ్రీనివాస్ (ఫైల్)
సిద్దిపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండు శ్రీనివాస్(35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న సందర్భంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది.
పక్కన ఉన్న వారు గొడవను ఆపారు. శ్రీనివాస్‌ను గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ స్పృహ కోల్పోయి, నోటిలో నుంచి నురగ రావడంతో అదే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానం ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని అతడి భార్య రాధ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గృహిణి మృతి..
అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్‌కు చెందిన నాచారం మరియమ్మ (41) ఈ నెల 16వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఈనెల 17న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పిల్లికోటాల్ శివారులో గల పిల్లికుంట వద్ద సోమవారం మరియమ్మ చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుంటలో వెతుకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై గాయం ఉండడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ టౌన్ సీఐ తెలిపారు.
ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం!
Comments
Please login to add a commentAdd a comment