suspance
-
అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం!
ఆదిలాబాద్: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని పా లుండిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై దుబ్బక సునీల్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఉట్నూర్ మండలంలోని చింతకర గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, కమలబాయి దంపతులకు కుమారుడు వినేష్(22) ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. అయితే మండలంలోని పాలుండిగూడ గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఆ యువతితో పెళ్లి విషయంలో వినేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పుడప్పుడు పాలుండిగూడకు వెళ్లి సదరు యువతిని కలిసేవాడు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి పాలుండిగూడ గ్రామంలో అతడి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాడు. రాత్రి బహిర్భూమికి వెళ్తానని బంధువులకు చెప్పి బయటకు వచ్చిన వినేష్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో యువకుడి బంధువులైన గజానంద్, కేశవ్‌లు గాలించగా బరద్వల్ బహుదుర్‌సింగ్ వ్యవసాయ చేనులో స్పృహ కోల్పోయి కనిపించాడు. ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శనివారం ఉదయం పాలుండిగూడ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వినేష్ మృతితో చింతకర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇవి చదవండి: వరుసకు చెల్లి.. అయినా ప్రేమ పెళ్లి.. కానీ చివరికి? -
వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి! అసలు కారణాలేంటి?
సిద్దిపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండు శ్రీనివాస్(35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న సందర్భంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. పక్కన ఉన్న వారు గొడవను ఆపారు. శ్రీనివాస్‌ను గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ స్పృహ కోల్పోయి, నోటిలో నుంచి నురగ రావడంతో అదే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానం ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని అతడి భార్య రాధ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గృహిణి మృతి.. అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్‌కు చెందిన నాచారం మరియమ్మ (41) ఈ నెల 16వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఈనెల 17న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పిల్లికోటాల్ శివారులో గల పిల్లికుంట వద్ద సోమవారం మరియమ్మ చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుంటలో వెతుకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై గాయం ఉండడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ టౌన్ సీఐ తెలిపారు. ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే
రెండు విరుద్ధమైన వాదనలెప్పుడూ కథను సుఖాంతం చేయవు. ఏది నిజం? ఏది అబద్ధం? అనే ప్రశ్నలను రగిల్చి, అపరిష్కృతంగా విడిచిపెడతాయి. మిస్టరీలుగా మిగిలిపోతాయి. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఐ–74 రోడ్డుపై జరిగిన ఘటన అలాంటిదే. అది 1980 జూన్ నెల. కటిక చీకటి, కారుమబ్బులకు హోరుగాలి తోడైంది. రాబర్ట్ డేవిడ్సన్ అనే వ్యక్తి బైక్ మీద ఇండియానాపోలిస్ లోని తన కూతురు ఇంటికి బయలుదేరాడు. వర్షం మొదలయ్యేలోపు అక్కడికి చేరుకోవాలని ఆయన ఆత్రం. కానీ అలా జరగలేదు. ఉన్నపళంగా జోరువాన మొదలైంది. నిజానికి కొన్ని గంటల ముందు నుంచే తుఫాను హెచ్చరికలు సాగుతున్నాయి. ఆ క్రమంలో రాబర్ట్ ఐ–74 రోడ్డుపైకి వచ్చేసరికి వర్షం పెరగడంతో బైక్ బాక్స్‌లోని రెయిన్ జాకెట్ తీసి వేసుకోవడానికి రోడ్డు పక్కకు బండి ఆపాడు. జాకెట్ తీసి, ధరించేలోపు.. ఉరుము ఉరిమి రాబర్ట్‌ను తాకింది. దారిన పోయేవారికి రాబర్ట్ కుప్పకూలడం స్పష్టంగా కనిపించింది ఆ మెరుపులో. చుట్టుపక్కలున్నవారికి అతడి ఆర్తనాదమూ వినిపించింది. పిడుగు దాడిలో 2,00,000 వోల్టుల కరెంటు ఒక్కసారిగా అతనిపై ప్రవహించడంతో రాబర్ట్‌లో ఉలుకూ పలుకూ లేదు. బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. సమాచారం అందిన కొంతసేపటికే అంబులెన్స్ అక్కడికి వచ్చేసింది. హుటాహుటిన అంబులెన్స్ ఎక్కించారు. రాబర్ట్ పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్సలోనే అతడు ఇక బతకడని నిర్ధారించారు. అతడిలో ఎలాంటి స్పందనా లేదు. ఏ అవయవం పనిచేయట్లేదు. గాలివాన మరింతగా పెరిగిపోతోంది. ఉన్నట్టుండి అంబులెన్స్‌లోని ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పని చేయడం మానేశాయి. చుట్టూ ఉన్న వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంట్ పోయిందని అనుకున్నారంతా. మరి అంబులెన్స్‌కి ఏమైంది? రెండు బ్యాకప్ బ్యాటరీలు ఉండగా ఇలా ఎందుకు జరిగింది? అనే అయోమయంలో ఉన్నారా సిబ్బంది. ఇంతలో ఓ అలికిడి. పైనుంచి కింద దాకా నల్లటి వస్త్రాలను ధరించిన ఓ స్త్రీ మూర్తి అక్కడికి వచ్చింది. అంత పెద్ద హోరు వానలో.. ఆమె ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చూడగా... అక్కడ అంబులెన్స్, ఫైరింజిన్, రాబర్ట్ బైక్ తప్ప ఇంకేమీ లేవు. ఆమె చాలా చొరవగా రాబర్ట్‌కు దగ్గరగా వచ్చి.. ‘నేనొకసారి ఇతణ్ణి తాకొచ్చా?’ అని అడిగింది. నిర్ఘాంతపోయారు అక్కడున్నవారు. అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు.. ‘ఏదైనా మంచి జరగబోతుందేమో?’ అనుకుంటూ ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె రాబర్ట్‌ని తాకింది. అతడి తలపై చేయి పెట్టి.. ఏవో మంత్రాలు చదివింది. రాబర్ట్‌నే చూస్తూ... మనసులో ఏదో అనుకుంది. కొంత సమయం గడిచాక.. ఆమె అంబులెన్స్ దిగి వెళ్లిపోయింది. ‘మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తుఫాన్లో ఎలా వెళ్తారు?’ లాంటి ఎన్నో ప్రశ్నలను సంధించారు అక్కడున్నవారు. కానీ ఆమె స్పందించలేదు. ఆమె అలా వెళ్లగానే ఇలా అంబులెన్స్‌లో లైట్లు వెలిగాయి. అప్పుడే రాబర్ట్లోనూ స్పందన కనిపించింది. దాంతో అంబులెన్స్ ఆసుపత్రివైపు కదిలింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్నప్పుడు కూడా రాబర్ట్ స్పృహలో లేడని... దాదాపు చనిపోయినట్లే అని వైద్యులు భావించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడని ప్రకటించారు. రెండు నెలలు గడిచాయి. అతను కోమా నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇలా బతికి ఉన్నాడంటే ఆమే కారణం అన్నారు నాటి ప్రత్యక్షసాక్షులు. ఆమె ఎవరు అని అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదు. నిజానికి అంత పెద్ద పిడుగు పాటుకి గురైన వ్యక్తి బతికి బట్టకట్టడం అనేది మిరాకిల్. అందుకే చాలామంది ఆ సిబ్బంది మాటలను నమ్మసాగారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ధరించిన దుస్తులు 1980 నాటివి కావని, 1800 కాలం నాటివని నాడు అంబులెన్స్‌లో ఉన్న పారామెడికో సిబ్బందిలో ఒకరు బయటపెట్టారు. ఆ విషయం ఆమెని అడుగుదామనుకుంటే.. ఆమె చాలా గంభీరంగా కనిపించిందని.. అడగటానికి భయమేసిందని అతడు చెప్పుకొచ్చాడు. దాంతో ఆ మహిళ ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఆమె అనేది అబద్ధమని.. పారామెడికోలు కట్టుకథ అల్లారనే వాదనలు ఒకవైపు నడుస్తుండగానే.. ఆమె దెయ్యమని కొందరు, కాదు దేవదూత అయ్యి ఉంటుందని మరికొందరు వాదనలకు దిగారు. అందుకు తగ్గ ఆధారాలను ఈ కథకు లింక్ చేశారు. ఆమె వచ్చిన సమయంలో అంబులెన్స్‌తో సహా చుట్టూ లైట్స్ ఆరిపోయాయి కాబట్టి.. ఆమె దెయ్యమేనని, పైగా ఆమె ధరించిన దుస్తులు 1800 కాలం నాటివని ప్రత్యక్షసాక్షి చెబుతున్నాడు అందుకని ఆమె కచ్చితంగా దెయ్యమేనని చెప్పుకొచ్చారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఆమె దేవదూత అనే దానికి ప్రత్యేక కారణం కూడా చెప్పారు. రాబర్ట్‌కి ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద మైదానం ఉందని, అక్కడ 19వ శతాబ్దంలో మతపరమైన ప్రార్థనలు జరిగేవని, వేలమంది ఆ ప్రార్థనల్లో పాల్గొనేవారని, అందువల్ల ఆమె.. దేవదూతేనని వాదించారు. దెయ్యం లేదా దేవదూత లేదా మత ప్రబోధకురాలు కావచ్చు అని కొందరు భావించారు. మొత్తంగా ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. చావు అంచుల దాకా వెళ్లిన రాబర్ట్‌ని బతకించేంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? అసలు ఆమె ఎవరు? అనేది నేటికీ తేలలేదు. రాబర్ట్ పునర్జన్మ మాత్రం మెడికల్లీ మిస్టరీనే. ∙ఎస్.ఎన్ -
సస్పెన్స్ సా...గుతోంది!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితాలు విడుదలైన దగ్గర్నుంచి చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని అధ్యక్షుడు నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు పనిచేయవు శివసేనలో చీలికలు రావడం ఖాయమని 25 మందికిపైగా సేన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కమలదళంపై కస్సుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాల్ని పనిచేయవని అన్నారు. గవర్నర్‌తో బీజేపీ చర్చలు బీజేపీ సీనియర్ నాయకులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై గవర్నర్‌తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్‌ని కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ఏం జరిగే అవకాశాలున్నాయ్ ! ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ లోపల ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టత రావాలి. లేదంటే జరిగే పరిణామాలు ఏవంటే.. ► ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చే వరకు దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించే అవకాశం. ► మహారాష్ట్ర గవర్నర్‌ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. సభలో బల నిరూపణకు గవర్నర్ సమయాన్ని ఇవ్వడం. ► బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరడం. ► మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం. -
వివాహిత అనుమానాస్పద మృతి
- అదనపు కట్నం కోసం హత్య చేశారంటున్న బంధువులు - మృతురాలిది సున్నిపెంట మార్కాపురం టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నీలకంఠయ్య వీధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి ఖాదర్‌బీ కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే షేక్ గౌస్‌కు కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన ఖాదర్ బీ కుమార్తె రహమత్బీ(24)తో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. కట్నంగా రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నం కావాలంటూ రహమత్బీని ఆమె భర్త వేధించాడు. ఈ విషయంపై పెద్ద మనుషులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఈలోపే రహమత్బీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం ‘మీ కుమార్తెకు ఫిట్స్ వచ్చి చనిపోయింది.’ అని ఖాదర్‌బీకి అల్లుడి తరఫు బంధువులు ఫోన్ చేశారు. మృతదేహం మెడపై గాయాలున్నాయి. బంధువులు వచ్చేలోపే మృతదేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టారు. తన కుమార్తెకు గతంలో ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, అల్లుడే కుమార్తెను చంపాడని ఖాదర్‌బీ కన్నీటిపర్యంతమైంది. అమ్మాయి తరఫు బంధువులు గౌస్, ఆయన బంధువులపై దాడికి ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. మృతురాలికి ఏడాది వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. మార్కాపురం ఎస్ఐ సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.