
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో షాకింగ్ సంఘటన ఒకటి వెలుగుచూసింది. నగరంలోని స్థానికి బీజేపీ నాయకుడు రామకృష్ణప్ప ఏకంగా స్కూల్ గదిలో ప్రధానోపాధ్యాయురాలు ఆశా పై దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. నోటికి వచ్చినట్టు తిడుతూ, అమానుషంగా దాడిచేశాడు. అక్కడితో అతగాడి ప్రకోపం చల్లారలేదు. పక్కనే ఉన్న చార్జర్‌తో ఆమె ముఖంపై పదేపదే కొట్టడం అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఉత్తర బెంగుళూరులోని సింగనయకనహళ్లిలో పాఠశాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ..బాధితురాలు ఆశా ప్రైవేట్ కిండర్ గార్టెన్ పాఠశాలలో పని చేస్తోంది. స్కూలు అవసరాల నిమిత్తం రామకృష్ణప్ప నుంచి రూ.70 వేలను వడ్డీకి తీసుకున్నారు. ఈ వడ్డీ చెల్లించడం ఆలస్యం కారణంకావడంతోనే ఇలా దాడిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బీజేపీ నేతని అదుపులోకి తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా నిందితుడు, ఎల్హెనంక ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రధాన అనుచరుడు, స్థానిక బీజేపీ నాయకుడు జనార్ధన్ తండ్రి. ప్రస్తుతం రామకృష‍్ణప్ప పరారీలో ఉండడంతో జనార్దన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ప్రధానోపాధ్యాయురాలిపై బీజేపీ నేత దాడి
Comments
Please login to add a commentAdd a comment