CCTV recorder
-
చెక్‌పోస్టుల అక్రమాలకు చెక్
సాక్షి, జన్నారం: సార్ ఈరోజు చెక్‌పోస్టు వద్ద ఎవరున్నారు... మీరే ఉన్నారా... రాత్రికి నా బండి వస్తది, జర విడిచిపెట్టండి...ఏదన్న ఉంటే చూసుకుంటా... అని ఓ స్మగ్లర్ చెక్‌పోస్టు డ్యూటీ చేసే సిబ్బందితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కలప తరలిస్తారు. సార్ ఈ రోజు ఉన్నారా మీరు... లేదు... రేపు నాకు డ్యూటీ ఉంటుంది.. రేపు రా అని ఓ అధికారి తన డ్యూటీని ముందుగానే స్మగ్లర్‌కు సమాచారం ఇస్తాడు. ఇలా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అక్రమంగా కలప తరలిపోవడానికి సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టెందుకు అధికారులు సమూల మార్పులు తీసుకొస్తున్నారు. చెక్‌పోస్టులను దాటించిన సంఘటనలు అనేకం: కలమడుగు అటవి చెక్‌పోస్టు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లో టైగర్‌జోన్ లో నుంచి కలప తరలిపోకుండా రాత్రి పూట వాహనాల రాకపోకలను జరుపకుండా ముత్యంపేట్, తపాలపూర్, పాడ్వాపూర్, కొత్తగూడం, కలమడుగు లలో అటవి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పగలంతా కలప తరలిపోకుండా చూడటమె కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహానాలను టైగర్‌జోన్ లో పర్యటన నిషేదించారు. చెక్‌పోస్టు డ్యూటీ దినం, తప్పించి దినం ఇద్దరే చేసే వారు. ఇద్దరే ఉండటం వల్ల రాత్రి పూట ఇసుక తరలించే వారి వాహానాల వద్ద ఎంతో కొంత తీసుకుని వాటిని వదిలివేయడం, ముందుగానే కలప తరలించే వ్యక్తులు డ్యూటీ చేసే వారితో మాట్లాడి కలప దాటించడం జరిగేది. ఇటివల అనేక వాహనాలను చెక్‌పోస్టులు దాటి లక్షేట్టిపేట్ వెళ్తుండగా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటివల మామిడిపెల్లి నుంచి వ్యాన్‌లో కలప చెక్‌పోస్టులు దాటి వెళుతుండగా లక్షేట్టిపేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు దాటించెందుకు వెళ్తుండగా జన్నారం అటవి అధికారులు ఒక కారును పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మార్పులు తీసుకువచ్చారు. ఎవరికి డ్యూటీ ఉంటుందో వారికే తెలియదు డ్యూటీ ఇద్దరికే ఇవ్వడం వల్ల వారితో స్మగ్లర్లు మచ్చిక చేసుకుని కలప తరలిస్తున్నారనే విషయాన్ని గమనించిన అటవిశాఖ ఎఫ్‌డీవో మాధవరావు నూతన డ్యూటీ విధానానికి తెరదించాడు. చెక్‌పోస్టు డ్యూటీ ఇద్దరికే కాకుండా డివిజన్ పరిధిలోని బీట్ అధికారులకు అందరికి వేయాలని యోచించాడు. డివిజన్లోని బీట్ అధికారికి ఒక గంట ముందే సమాచారం ఇచ్చి డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఇస్తున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద ఎవ్వరు డ్యూటీ చేస్తారో అనే విషయం స్మగ్లర్లకు తెలియకుండా ఉంటుంది. తనకు డ్యూటీ ఉంటుందనే విషయం ఆ బీట్ అధికారికే తెలియని పరిస్థితి ఉంటున్నందున అక్రమాలు జరిగే అవకాశం లేదు. అదే విధంగా గతంలో చెక్‌పోస్టు డ్యుటీలు చేసిన వారు కూడ తిరిగి బీట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకే రోజు డ్యూటి ఉంటున్నందున తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదనేది అధికారుల ఆలొచన. సీసీ కెమెరాలతో నిఘా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. గతంలో సీసీ కెమరాలను అమర్చిన వాటి ప్రసారం కేవలం చెక్‌పోస్టు వద్దనే ఉండేది. అయితే ఎఫ్‌డీవో మాధవరావు చెక్‌పోస్టు వద్ద అమర్చిన సీసీ పుటేజీలు తన కార్యాలయంలో, తన మోబైల్లో కనిపించేలా తగు ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల నిర్వహణపై ప్రతి రోజు, ఖాళీ సమయంలో మోబైల్ లో లేదా, తన కార్యాలయంలోని కంప్యూటర్లో పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైన అవకతవకలు జరిగే క్రమంలో సదరు సిబ్బంది చెక్‌పోస్టు వద్ద కెమరాను బందు చేసి వాహనం వెళ్లాక తిరిగి ఆన్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే కెమరాలోని వివరాలు అక్కడే అమర్చిన కంప్యూటర్లో రికార్డు అయ్యేది. వాటిని అధికారులు ఎప్పుడో ఒక్కసారి పరిశీలించేవారు. కాని ఇప్పుడు ఇక కెమరాలను ఆపి వేసే వీలు కూడ ఉండదు. కొన్ని సమయాల్లో వాహానాలను వదిలిపెడితే అప్పుడే ఫోన్ చేసి అడిగి అనుమానం నివృత్తి చేసుకునే వీలుంటుంది. దీంతో భయానికి చెక్‌పోస్టు వద్ద ఉండే సిబ్బంది అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. చెక్‌పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల తనిఖీలలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమూల మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాను చెక్‌పోస్టులలో కలప తరలిపొవడమ గమనించాను. సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన అప్పుడప్పుడు ఒకటి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాము. కొత్త విధానం వల్ల సిబ్బందికి భయం ఉంటుంది. అదే విధంగా డ్యూటీ ఎవ్వరు చేస్తున్నారో తెలియకుండా ఉంటుంది. కేవలం గంట ముందే డ్యూటీ చేసే సిబ్బంది గురించి సంబంధిత రేంజ్ అధికారి వారికి తెలియజేస్తారు. దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం. – మాధవరావు, ఎఫ్‌డీవో -
సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..
న్యూఢిల్లీ: దొంగల ముందుజాగ్రత్త మొదటికే మోసం తెచ్చింది. సీసీటీవీ అనుకుని దొంగలు సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలోని బేగంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పక్కా ప్లాన్‌తో నలుగురు దొంగలు శనివారం మిట్టమధ్యాహ్నం ఓ నగల దుకాణంలో చొరబడ్డారు. ముందుగా ఇద్దరు దొంగలు కస్టమర్లలా షాపులో అడుగుపెట్టారు. ఆ తర్వాత షాపులోకి ప్రవేశించిన మరో ఇద్దరు చేతిలో పిస్టోలు పట్టుకుని అక్కడి జనాలను బెదిరించారు. షాపు మొత్తం కలియతిరిగి నగలు, నగదు ఉన్నదంతా ఊడ్చుకుపోదామని చూశారు. అయితే షాపు యజమాని నగదు ఇవ్వడానికి ససేమీరా ఒప్పుకోలేదు. దీంతో ఓ దొంగ పిస్టోలుతో అతడ్ని బాది డబ్బు లాక్కునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ.1 లక్ష చేజిక్కించుకున్నారు. అయితే ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డవుతుందని భావించిన దొంగల ముఠాలోని ఓ వ్యక్తి సీసీ కెమెరా (డీవీఆర్)ను కూడా ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు. దుకాణమంతా తిరిగి అతనికి కనిపించిన ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా అది సీసీ కెమెరా రికార్డు చేసేది కాదు, సెటప్ బాక్స్. వచ్చిన పని ముగించుకుని హాయిగా దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు హుటాహుటిన దుకాణానికి చేరుకున్నారు. అయితే సీసీ టీవీకి బదులుగా సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు పెద్దగా శ్రమ కల్పించలేదు. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఎస్డీ మిశ్రా మాట్లాడుతూ.. సీసీటీవీ పుటేజీలో దొరికిన ఆధారాలతో అనుమానితులను గుర్తిస్తామన్నారు. చాలావరకు నగలు భద్రంగానే ఉన్నాయని, వాటిని తెరవడం దొంగలకు సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు. -
ఊపిరాడటం లేదు.. కెమెరాలో రహస్యం
జంతు ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల కంటే ఎక్కువగా మూగ జీవాల్నే ప్రేమిస్తారు. అయితే కొన్ని సార్లు ఆ జంతువులు చేసే పనులు వల్ల రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అలాంటి సంఘటన గురించే ఇప్పుడు చదవబోతున్నాం. గ్రీడ్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మాంచి నిద్రలో ఉండగా సడెన్‌గా ఊపిరాడకుండా పోతుంది. ఇదంతా దెయ్యాల పనేమో అని భావించాడు. అయితే ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఓ రోజు తన బెడ్రూంలో సీసీకెమెరా పెట్టి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఉదయం నిద్ర లేచాక కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూసి చూసి ఒకింత షాక్‌కు గురయ్యాడు గ్రీడ్. దెయ్యం అనుకుని భయపడి చచ్చిన అతడు.. సమస్యకు అసలు కారణం తెలిసిన తర్వాత నవ్వుకున్నాడు. ఇంతకు కెమెరాలో ఏం రికార్డయ్యింది అంటే.. గ్రీడ్ నిద్రపోయిన తర్వాత అతడి పెంపుడు పిల్లి వచ్చి అతడి ముఖం మీద పడుకుంటుంది. దాంతో అతడికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశాడు గ్రీడ్. “I couldn’t breathe when I slept so I installed a camera” pic.twitter.com/DDhP0OweoW — Greed (@stluis_htx) July 22, 2019 పిల్లి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. గ్రీడ్ లానే జంతువులను పెంచుకునే కొందరు దీని గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ పిల్లి మిమ్మల్ని చంపాలనుకుంటుంది’.. ‘మీకు గురక పెట్టే అలవాటు ఉందేమో.. అందుకే పిల్లి ఇలా చేస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
షాకింగ్ : ప్రధానోపాధ్యాయురాలిపై బీజేపీ నేత దాడి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో షాకింగ్ సంఘటన ఒకటి వెలుగుచూసింది. నగరంలోని స్థానికి బీజేపీ నాయకుడు రామకృష్ణప్ప ఏకంగా స్కూల్ గదిలో ప్రధానోపాధ్యాయురాలు ఆశా పై దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. నోటికి వచ్చినట్టు తిడుతూ, అమానుషంగా దాడిచేశాడు. అక్కడితో అతగాడి ప్రకోపం చల్లారలేదు. పక్కనే ఉన్న చార్జర్‌తో ఆమె ముఖంపై పదేపదే కొట్టడం అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఉత్తర బెంగుళూరులోని సింగనయకనహళ్లిలో పాఠశాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ..బాధితురాలు ఆశా ప్రైవేట్ కిండర్ గార్టెన్ పాఠశాలలో పని చేస్తోంది. స్కూలు అవసరాల నిమిత్తం రామకృష్ణప్ప నుంచి రూ.70 వేలను వడ్డీకి తీసుకున్నారు. ఈ వడ్డీ చెల్లించడం ఆలస్యం కారణంకావడంతోనే ఇలా దాడిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బీజేపీ నేతని అదుపులోకి తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా నిందితుడు, ఎల్హెనంక ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రధాన అనుచరుడు, స్థానిక బీజేపీ నాయకుడు జనార్ధన్ తండ్రి. ప్రస్తుతం రామకృష్ణప్ప పరారీలో ఉండడంతో జనార్దన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలిపై బీజేపీ నేత దాడి -
సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు..
మెదక్: మెదక్ జిల్లాలో దొంగలు తెలివి మిరిపోయారు. దొంగతనం చేయడంతో పాటు ఏకంగా సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయిన ఘటన పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక మల్లిఖార్జున రైస్‌మిల్‌లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. నగదుతో పాటు సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు. రైస్‌మిల్లు యజమాని సోమవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. టేబుల్‌ను ధ్వంసం చేసిన దుండగులు, బీరువాలోని రూ.1.42 లక్షల నగదును ఎత్తుకుపోయారు. వెళ్తూవెళ్తూ సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు. మిల్లు యజమాని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు.