జంతు ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల కంటే ఎక్కువగా మూగ జీవాల్నే ప్రేమిస్తారు. అయితే కొన్ని సార్లు ఆ జంతువులు చేసే పనులు వల్ల రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అలాంటి సంఘటన గురించే ఇప్పుడు చదవబోతున్నాం. గ్రీడ్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మాంచి నిద్రలో ఉండగా సడెన్‌గా ఊపిరాడకుండా పోతుంది. ఇదంతా దెయ్యాల పనేమో అని భావించాడు. అయితే ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఓ రోజు తన బెడ్రూంలో సీసీకెమెరా పెట్టి పడుకున్నాడు.
ఆ రోజు రాత్రి కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఉదయం నిద్ర లేచాక కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూసి చూసి ఒకింత షాక్‌కు గురయ్యాడు గ్రీడ్. దెయ్యం అనుకుని భయపడి చచ్చిన అతడు.. సమస్యకు అసలు కారణం తెలిసిన తర్వాత నవ్వుకున్నాడు. ఇంతకు కెమెరాలో ఏం రికార్డయ్యింది అంటే.. గ్రీడ్ నిద్రపోయిన తర్వాత అతడి పెంపుడు పిల్లి వచ్చి అతడి ముఖం మీద పడుకుంటుంది. దాంతో అతడికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు గ్రీడ్.
“I couldn’t breathe when I slept so I installed a camera” pic.twitter.com/DDhP0OweoW
— Greed (@stluis_htx) July 22, 2019
పిల్లి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. గ్రీడ్ లానే జంతువులను పెంచుకునే కొందరు దీని గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ పిల్లి మిమ్మల్ని చంపాలనుకుంటుంది’.. ‘మీకు గురక పెట్టే అలవాటు ఉందేమో.. అందుకే పిల్లి ఇలా చేస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment