పీపీటీ స్లైడ్‌లు
‘నాకు పిల్లిని కొనివ్వండి’ అని అడగటానికి ఓ చిన్నారి చేసిన ప్రయత్నం నెటిజన్లనే కాదు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కూడా మెప్పించింది, ఒప్పించింది. కావాల్సింది దక్కించుకోవటానికి మారాం చేయాల్సిన వయస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరినీ వ్వాహ్వా అనిపించింది. క్రిస్టోఫర్ డోయ్‌లే అనే వ్యక్తి తన కూతరు పిల్లిని కొనివ్వండి అని అడగటానికి చేసిన పీపీటీ ప్రయత్నాన్ని ఈ నెల 25న తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మా కూతురు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసింది’ అంటూ శీర్షికను జోడించాడు. దీంతో పీపీటీ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘బలవంతపెట్టే పీపీటీ! మమ్మల్ని కూడా ఒప్పించేసింది’ అంటూ కామెంట్ చేసింది. ( తల్లి ప్రాణాలు కాపాడటానికి పిల్లాడు..)
చిన్నారి తన పీపీటీలో పిల్లిని పెంచుకుంటే కలిగే లాభాలను ఇలా వివరించింది...
1) పిల్లిని పెంచుకోవటం వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది. అవి మనల్ని సంతోషంగా ఉంచుతాయి.
2) మీరు పెంచుకుంటున్నది ఓ పిల్లి అయితే దాన్ని మీరు వాకింగ్ కోసం బయట తిప్పక్కర్లేదు.
3) ఇంకో సారి నేను పిల్లి కావాలని అడగటం మీరు వినరు.
4) పిల్లి బాధ్యతలను మొత్తం నేనే దగ్గర ఉండి చూసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment