బీజేపీ కార్యాలయంపై దాడి
Published Fri, Jul 28 2017 10:58 AM | Last Updated on Fri, Mar 29 2019 6:01 PM
తిరువనంతపురం: కేరళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన వెనుక సీపీఐ(ఎం) కార్యకర్తల హస్తం ఉందంటూ బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేయడంతో పాటు రాళ్లు రువ్వడం వల్ల ఆఫీస్ బయట పార్క్ చేసి ఉంచిన పలు వహనాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. రాజశేఖరన్ కార్యాలయంలో ఉండగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం అయ్యాయని బీజేపీ నాయకులు తెలిపారు.
Advertisement
Advertisement