
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తన బలాన్ని ప్రదర్శిస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం రెండున్నరేళ్ల గరిష్ట స్థాయిలకు చేరుకుంది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి క్రితం ముగింపుతో పోలిస్తే 12 పైసలు లాభపడి 63.41వద్ద క్లోజయింది. క్రితం ముగింపు 63.53 కాగా, గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 63.59 వద్ద ప్రారంభమై 63.62 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.
అక్కడి నుంచి పుంజుకుని 63.36 వరకు బలపడింది. చివరికి 63.41 వద్ద ముగిసింది. 2015 జూలై 15 తర్వాత రూపాయి తిరిగి ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఆర్థిక రంగం పట్ల ఆశావాదం, నిధుల రాకపై అంచనాలు ర్యాలీకి జోష్‌నిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment