ముంబై: రూపాయి భారీ పతనం, కరెంటు అకౌంటు లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం..బ్యాంకర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో (ఎఫ్‌ఐఐ) వేర్వేరుగా సమావేశమయ్యారు. అంతకంతకూ పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును భర్తీ చేసు కునే దిశగా విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వీటిలో చర్చించారు. ఈ సమావేశాలో పలు సూచనలు చర్చకు వచ్చినట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ టక్రూ వివరించారు. వీటి ఆధారంగా పెట్టుబడులకు ఊతమిచ్చేలా వచ్చే ఎనిమిది, పది రోజుల్లో కొన్ని చర్యలు ఉండగలవని టక్రూ పేర్కొన్నారు.