అప్పులబాధ తాళలేక సోమవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.
యాదాద్రి: అప్పులబాధ తాళలేక సోమవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామ పరిధిలోని మదిరె ఇప్పల్ల గ్రామానికి చెందిన జక్క నర్సిరెడ్డి(55)కి మూడెకరాల వ్యవసాయ పొలం ఉంది.
ఆరు నెలల క్రితం అప్పు తెచ్చి మూడు బోర్లు వేయగా చుక్క నీరు పడలేదు. వీటికి తోడు పంట దిగుబడి రాక పెట్టుబడి కూడా రాలేదు. అంతకుముందు కూతురి పెళ్లికి కొంత అప్పు చేశాడు. వడ్డీలు పెరిగి అప్పు కాస్తా రూ.8 లక్షలకు చేరింది. అప్పు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది సోమవారం పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడు.