
సాక్షి,జవహర్‌నగర్( హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌లో హనుమండ్ల రామకృష్ణ (38) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రామకృష్ణ 18 సంవత్సరాల క్రితం రాజ్యలక్ష్మిని ప్రేమవివాహం చేసుకుని సాఫీగా జీవనం సాగిస్తున్నాడు.
ఓ కంపెనీలో డెవలివరీ బాయ్‌గా పనిచేసే రామకృష్ణకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. రామకృష్ణ తండ్రి మరణించడంతో అతని అంత్యక్రియలకు కొంత మంది వద్ద అప్పులు తీసుకున్నాడు. అంతేకాకుండా కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో రామకృష్ణ అత్తగారింటికి వచ్చి రూ.5లక్షల అప్పు అయిందని వాటిని తీర్చడం కష్టంగా ఉందని లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికినీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమను అంగీకరించలేదు.. కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే..
Comments
Please login to add a commentAdd a comment