Viral Video: Mother saved her toddler from falling down the stairs - Sakshi
Sakshi News home page

Viral Video: ఆ తల్లి స్పాట్‌లో స్పందించింది లేదంటే!..ఆ చిన్నారి పరిస్థితి..

Published Mon, Apr 10 2023 2:31 PM | Last Updated on Mon, Apr 10 2023 2:59 PM

Viral Video: Mother Saved Her Toddler From Falling Down The Stairs - Sakshi

పిల్లలు రెప్పపాటులో ఏం చేసుకుంటారో లేదా ఏం చేస్తారో చెప్పలేం. తెలిసి తెలియక చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులు బాధ అంత ఇంతకాదు. నిరంతరం వారేం చేస్తున్నారో అని ఒక కంట కనిపెడుతున్నా..ఏదో ఒక ఉపద్రవం కొనతెచ్చుకుంటూనే ఉంటారు. ఓ వయసు వచ్చేదాక అలాంటి చిన్నారులతో కాస్త ఇబ్బంది, టెన్షన్‌ తప్పవనే చెప్పాలి. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి కూడా తన తల్లి అలా ఫోన్‌లో మాట్లాడుతుండగా..స్పీడ్‌గా మెట్ల వద్దకు వెళ్లిపోయాడు.

అంతే అక్కడ నుంచి ఒక్కసారిగా తూలిపోయాడు. దీంతో ఆ తల్లి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబాలున కిందకు వంగి పిల్లాడిని పట్టుకునే యత్నం చేసింది. అదే సమయానికి చుట్టుపక్కల వాళ్లు కూడా స్పందించి ఆ తల్లికి సాయం అందించారు. ఆ తల్లి మాత్రం ఎంతో చాకచక్యంగా తన బిడ్డను కాపాడుకుంది. తల్లి హృదయం ఎంతకైనా తెగించేలా లేదా ఎంతటి సాహసానికైనా దిగేలా చేస్తుంది కదా.

ఐతే అక్కడే ఉన్న మరో వ్యక్తి మాత్రం ఆ పిల్లాడిని పట్టుకోవాలని కిందకు వెళ్లడం విచిత్రంగా అనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ మారింది. దీంతో నెటిజన్లు ఆ తల్లి ధైర్యానికి మెచ్చకోగా, మరికొందరూ ఆ పిల్లాడిని పట్టుకోవడానికి కిందకు వెళ్తున్న వ్యక్తిని చూసి కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: సివిల్‌ సర్వీస్‌ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు.. ‘ఇంతకుముందు గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు లేదు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement