పుణే: జాతిపిత మహాత్మాగాంధీని రక్షించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్‌ఏ భికు దాజీ భిలారే (98) కన్ను మూశారు. గాంధీని నాధూరాం గాడ్సే నుంచి కాపాడిన బిలారే బుధవారం మహారాష్ట్రలో చనిపోయినట్టుగా కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు భిలారే మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ హత్యకు హత్యకు ముందు నాలుగు సంవత్సరాల ముందు 1944లో ఒక సమావేశంలో నాథూరామ్ గాడ్సే మరో ఇద్దరు సహచరులతో కలిసి గాంధీని కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించినపుడు భిలారే వారిని ప్రతిఘటించి మరీ గాంధీని రక్షించినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
పలు స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు భిలారే అంత్యక్రియలకు హాజరై ఆయనకు నివాళులర్పించారు. ఎల్లప్పుడూ సామాజిక మరియు ప్రజా సేవలలో నిమగ్నమై ఉండే ఆయన మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల హక్కులు ప్రయోజనాల కోసం చాలా క్రియాశీలకంగా పనిచేశారనీ, చివరి శ్వాసవరకు చురుకుగా ఉన్నారని ఆయన సన్నిహిత స్నేహితులు, రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ మహాజన్ చెప్పారు. రాష్ట్ర సేవాదళ నాయకుడిగా ఉన్న బిలారేకి అప్పటికి పాతికేళ్లు అనీ, గాంధీపై జరిగిన 6 హత్యాయత్నాల్లో ఒకదానినుంచి కాపాడారని మహరాజన్ గుర్తు చేసుకున్నారు.
కాగా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్న భిలారే క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం 1948, జనవరి 30న గాడ్సే ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద గాంధీని కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
గాడ్సేను అడ్డుకున్న భిలారే కన్నుమూత
Published Thu, Jul 20 2017 11:43 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement