జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.
అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment