మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.
వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.
ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.
ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.
– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment