Sri Ganapathy Sachchidananda Swamiji
-
ఏది అత్యుత్తమ మార్గం?
మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అసలైన ప్రార్థన అంటే?
మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
కోరికలు – ఆత్మ సాధన! కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే..
మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి ‘నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?’రెండు ‘ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా?’ అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేర కపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీస్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది. కోరి కలు నెరవేరినా లేక నెరవేర కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటు వంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
మరణభయం పోవాలంటే..?
చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు మార్పు. శైశవం వదలి బాల్యంలోకి, బాల్యం వదలి యవ్వనంలోకి, అత్యంత ప్రియమైన యవ్వనం నుంచి ముసలి తనానికి ఈ మార్పు కారణం అవుతుంది. చివరగా ముసలితనం మరణానికి దారితీస్తుంది.రాత్రి... గడచిపోయి సూర్యోదయానికి స్వాగతం పలుకుతుంది. ఉదయం గడచి మధ్యాహ్నానికి అవకాశమిస్తుంది. అదే విధముగా రాత్రి ప్రారంభం కాగానే మధ్యాహ్నం పోతుంది. ప్రకృతి తిరుగులేని నియమాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఆ నియమం అనుసరించి జన్మించిన ప్రతి జీవీ మరణించవలసిందే. అలాగే మరణించిన ప్రతి జీవీ తిరిగి జన్మించవలసిందే. ఈ విçషయాన్ని సరిగా అవగాహన చేసుకుంటే మరణం వల్ల భయం కలుగదు. ఈ భయ నివారణకు తిరిగి జన్మించకుండా ఉండటమే సరైన మార్గం. జననమే లేనప్పుడు మరణించే ప్రసక్తే ఉండదు కదా!ఎంతకాలం ‘ఈ దేహమే నేను’ అనే దేహాత్మ భావన ఉంటుందో అంతవరకు మరణ తప్పదు. ఏ క్షణం శారీరక స్పృహను దాటుతామో, అప్పుడే మనం నాశ రహితులం అవుతాం. పుట్టిన ప్రతి జీవీ గిట్టకతప్పదని తెలిసినా ఎవరికి వారు తమకు మరణం లేదని అనుకొంటూ ఉండటమే ఆశ్చర్య కరమైన విషయం అని ధర్మరాజు మహాభారతంలో ఒకచోట అంటాడు. ఇది ఆలోచించదగిన విషయం.ఒకానొక సందర్భంలో ఓ యక్షుడు ధర్మరాజును అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది? (కిం ఆశ్చర్యం?) అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు ధర్మరాజు ‘ప్రతి క్షణం లెక్కలేనన్ని జీవులు యముని (మృత్యుదేవత) రాజ్యాన్ని చేరుకొంటున్నాయి. అయినప్పటికీ జీవించి ఉన్నవారు మాత్రం తమకు మరణం ఉన్నదని తెలిసీ లేనివారివలె జీవిస్తారు’ అని సమాధానం ఇస్తాడు. మానవుని జీవితం క్షణభంగురం. మరణం అనివార్యం. కాబట్టి మానవులందరూ ప్రతిక్షణాన్నీ సద్వినియోగపరచుకోవాలి. కాలం గడచిన పిమ్మట గతంలోకి తొంగిచూచుకొని ‘అయ్యో! నేను కాలాన్ని సద్వినియోగపరచుకొనలేకపోయాన’ని బాధపడటానికి ఎలాంటి అవకాశం లేకుండా జీవితాన్ని గడపాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
భగవత్ప్రసాదం! ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’..
ఈ విశ్వంలో ఆలోచనలు, భావనలను మనిషి మాత్రమే మాటల ద్వారా తెలుపగలడు. ఏ ఇతర జీవికీ మాట్లాడే శక్తి లేదు. మాట్లాడటం అనేది భగవంతుడు మానవునికి అనుగ్రహించిన వరప్రసాదం. మానవుడు తన జీవితాన్ని సంతోషమయం లేక దుఃఖమయం కావించుకోవడం అనేది దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని ఉపయోగించుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మాటను సరిగా, విచక్షణతో ఉపయోగించుకొన్న మానవుడు... తాను ఆనందంగా ఉండడమే కాక ఇతరులను కూడా సంతోషపరచగలడు.దీనికి భిన్నంగా విచక్షణారహితమైన, అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడుట వల్ల సమస్యలు వస్తాయి. ఫలితంగా మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది. ఈ కారణం వల్లనే ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’ అని పెద్దలు చెప్పారు. మనం సర్వకాల, సర్వావస్థలయందు తియ్యగా, ఇంపుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనం మాట్లాడే పద్ధతి ఇతరులను కోపోద్రిక్తులను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. నియమాలను ఉల్లంఘించకుండా ఉండడమే వినయం. ఈ పద్ధతి భగవద్గీతలో ‘వాజ్మయ తపస్సు’అని తెలుపబడినది.మనం చేయు భౌతికపరమైన పనులన్నీ ఆలోచనలపైననే ఆధారపడి ఉంటాయి. ఆలోచించడం, మంచి– చెడులను తెలుసుకొనడం బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిబలాన్ని ఉపయోగించి ‘ఏది ఉచితం, ఏది ఉచితంకాదు’ అని మనం తెలుసుకో గలుగుతున్నాం. మనం చేసే పనిని బట్టి మన ఆలోచన వ్యక్తమవుతుంది.ఉదాహరణకు ఒక వక్త ముందు మైక్ ఏర్పాటు చేసినా... ఆ వక్త ఆలోచన మాటల రూపంలో బయటికి రానంత వరకూ మైక్ మనకు వినిపింపచేయలేదు. అలాగే క్రియ అనేది దానంతట అది మంచి కాదు లేక చెడు కాదు. దీని (చర్య) మంచి, చెడులు దీనికి మూలాధారమైన ఆలోచనలోనే ఉంటాయి. అందువల్లనే మనం చేసే పని మంచిగానూ, గౌరవప్రదంగానూ ఉండాలి. మంచి ఆలోచనలకే తావునిచ్చి, వాటిని వృద్ధి చేసుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
దైవానుభవానికి మార్గం..
దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
సంతృప్తిని మించిన సంపద లేదు
-
ఆ విషయం శ్రీ కృష్ణుడితో చెప్పకపోవడం వల్ల...!
-
యదు వంశపు చరిత్ర
-
శ్రీ కృష్ణుని భార్యలు చేసిన పుణ్యం
-
గోపికలు పరమాత్ముడి యొక్క భుజాలు చూసి ఆనందపడేవారు
-
ఆత్మఘాతకులు అంటే వాళ్ళే
-
పరమాత్ముడిని మర్చిపోకూడదు
-
శృతి గీత అంటే ఇదే
-
దుఃఖం నుంచి బయటకు రావాలి
-
అందుకే కృష్ణుడు సర్వాంతర్యామి అయ్యాడు
-
పాండవులందరూ అందుకే సంతోషించారు
-
శ్రీకృష్ణుడు కీర్తి అమృతమైంది ఎందుకంటే ?
-
సైన్స్ యే పరమాత్మా..!
-
ఇంద్రియ భోగములు అంటే ఏంటి..?
-
వసుదేవుని యజ్ఞోత్సవం
-
కలలో వచ్చినవే నిజం అనుకుంటారు..
-
శ్రీకృష్ణుడు దర్శనమే...గొప్ప లాభాన్ని చేకూరుతుంది అన్నాడు
-
సీఎం జగన్ దత్తపీఠం సందర్శన ఫొటోలు