
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సోమవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి.. 10.30కి ఆశ్రమానికి చేరుకుంటారు. 10.50 వరకూ ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు.
అనంతరం స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు. 11.30 గంటలకు ఆయన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉండగా ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను.. సీఎం భద్రతాధికారులు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment