మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి ‘నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?’
రెండు ‘ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా?’ అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేర కపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీస్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది. కోరి కలు నెరవేరినా లేక నెరవేర కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటు వంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?
మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment