
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ భర్త మృతిని తట్టుకోలేకపోయింది. అదే ఆవేదనలో 2 గంటల తరువాత ఆమె కూడా మృతి చెందింది. గంటల వ్యవధిలో ఒకే ఇంటిలో ఇద్దరు మృతి చెందడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది.
బఘౌరా గ్రామానికి చెందిన 50 ఏళ్ల ప్రీతమ్ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వాటిని పొలానికి తీసుకు వెళ్లాడు. వర్షాల కారణంగా అక్కడి చెక్ డ్యామ్ లోనికి నీరు ప్రవేశించింది. ఈ విషయం ప్రీతమ్‌కు తెలియలేదు. సాయంత్రం అతను తిరిగివస్తున్నప్పుడు చెక్ డ్యామ్‌లో మునిగిపోయాడు. సాయంత్రం ప్రీతమ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం అన్నిచోట్లా వెదికారు.
వారికి చెక్‌డ్యామ్ బయట ప్రీతమ్ చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఈతగాళ్ల సాయంతో చెక్‌డ్యామ్‌లో గాలించగా, ప్రీతమ్ మృతదేహం లభ్యమయ్యింది. ప్రీతమ్ మృతి చెందాడనే విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రమైన ఆవేదనలో కూరుకుపోయిన అతని భార్య.. భర్త మృతి చెందిన రెండు గంటలకు కన్నుమూసింది.
ఈ ఉదంతం గురించి మృతుడు ప్రీతమ్ బంధువు ఉధమ్‌సింగ్ మాట్లాడుతూ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వెళ్లిన ప్రీతమ్ అనుకోకుండా చెక్‌డ్యామ్‌లో మునిగి మృతి చెందాడని, ఈ విషయం తెలిసిన అతని భార్య గీత కూడా మృతిచెందిదని తెలిపారు.
ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’
Comments
Please login to add a commentAdd a comment