♦ బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే... ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం గొప్పది. అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే... బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి.
అవసరాల్ని తీర్చని ఆస్తుల కంటే... ఆకల్ని తీర్చే అన్నం గొప్పది.
♦ వయస్సు పెరిగే కొద్దీ సమాజంలో, మనిషి జీవితం ఆప్యాయతకి, మంచితనానికి చిరునామా, అలంకరణ కావాలి. కానీ, అహంకారానికి, ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు.
♦ ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అత్యాశ అధఃపాతాళానికి దారితీస్తుంది. నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది.
♦ సేవచేయడం, శ్రద్ధగా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, ΄పాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తి శిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే మహోన్నత మార్గాన మనిషిని నడిపిస్తాయి.
♦ నిన్నటి కన్నా నేడు మిన్నగా... నేటికన్నా మిన్నగా రేపు జీవించాలి.
♦ జీవితంలో వాస్తవం ఉండాలి. ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి.
♦ మన జీవితాన్ని మనమే రూపు దిద్దుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment