greed
-
కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్
కరోనా సమయంలో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా కుదుటపడుతున్నాయి, లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ.. జోహో ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' కీలక వ్యాఖ్యలు చేశారు.100 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న కంపెనీకి.. వార్షిక ఆదాయం 1.5 రెట్లు కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ 20 శాతం లాభాలను గడిస్తోంది. మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.18 కోట్ల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా రూ. 40కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి కూడా సంస్థ సిద్ధమైంది. ఇంత లాభాలతో ముందుకు సాగుతున్న కంపెనీ.. ఉద్యోగులలో 12 నుంచి 13 శాతం తొలగింపులు చేపట్టడం అంటే.. ఇది పెద్ద దురాశే అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'ప్రెష్‌వర్క్స్' కంపెనీని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే సుమారు 660 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఉద్యోగులను తొలగించే సంస్కృతి కొన్ని అగ్రదేశాల్లో ఉంది. దానిని మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది ఉద్యోగులకు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చెరిపివేస్తుంది. సంస్థలో ఎప్పుడూ.. కస్టమర్లను, ఉద్యోగులను మొదటి స్థానంలో ఉంచాలి. ఆ తరువాత స్థానంలో వాటాదారులు ఉండాలని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.A company that has $1 billion cash, which is about 1.5 times its annual revenue, and is actually still growing at a decent 20% rate and making a cash profit, laying off 12-13% of its workforce should not expect any loyalty from its employees ever. And to add insult to injury,…— Sridhar Vembu (@svembu) November 7, 2024 -
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అమృత బిందువులు
♦ బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే... ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం గొప్పది. అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే... బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి. అవసరాల్ని తీర్చని ఆస్తుల కంటే... ఆకల్ని తీర్చే అన్నం గొప్పది. ♦ వయస్సు పెరిగే కొద్దీ సమాజంలో, మనిషి జీవితం ఆప్యాయతకి, మంచితనానికి చిరునామా, అలంకరణ కావాలి. కానీ, అహంకారానికి, ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు. ♦ ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అత్యాశ అధఃపాతాళానికి దారితీస్తుంది. నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది. ♦ సేవచేయడం, శ్రద్ధగా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, ΄పాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తి శిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే మహోన్నత మార్గాన మనిషిని నడిపిస్తాయి. ♦ నిన్నటి కన్నా నేడు మిన్నగా... నేటికన్నా మిన్నగా రేపు జీవించాలి. ♦ జీవితంలో వాస్తవం ఉండాలి. ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి. ♦ మన జీవితాన్ని మనమే రూపు దిద్దుకోవాలి. -
బరువైన బాధ్యతలు
పాదుషాగారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. రాజుగారు మరెన్నో రోజులు బతకరని వైద్యులు చెప్పారు. ఆయనకు వారసులు లేకపోవడంతో పాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలనే సమస్య వచ్చిపడింది. ‘‘ఎవరైతే నేను చనిపోయాక ఒక్కరోజుపాటు నా సమాధిలో నాతో పాటు నిద్రిస్తారో అలాంటి వారిని రాజుగా ఎన్నుకోవాలి’’ అని వీలునామా రాసి రాజ్యంలోని నలుమూలలా ప్రకటన చేయించాడు రాజుగారు. ఈ వింత ప్రకటనకు అంతా భయంతో కంపించిపోయారు. ఒక్క రాత్రి సమాధిలో ఉంటే చాలు.. రాజ్యమంతా తన హస్తగతమవుతుందనే దురాశతో ఒక దేశదిమ్మరి రాజుగారి షరతుకు అంగీకరించాడు. త్వరలోనే రాజుగారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ దేశదిమ్మరి రాజుగారి సమాధిలో రాజుగారితో బాటు ఒక్కరోజు గడిపేందుకు సిద్ధమయ్యాడు. రాజుగారితో పాటు ఆ దేశదిమ్మరిని కూడా ఖననం చేశారు. ఆ రోజు రాత్రి సమాధిలోకి భయంకరమైన ఆకృతితో దైవదూతలు వచ్చి ‘‘లే నీ లెక్క చూపు’’ అని గద్దించారు. ‘‘నేను లెక్క చెప్పడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఒకే ఒక్క గాడిదతో జీవితాన్ని నెట్టుకొచ్చాను’’ అని బదులిచ్చాడు ఆ దేశదిమ్మరి. అంతలో దేవదూతలు అతని కర్మల చిట్టా విప్పి చూశారు. ‘‘ఫలానా రోజు నీ గాడిదను పస్తులుంచావు. ఫలానా రోజున గాడిదపై శక్తిని మించిన బరువు మోపి చితకబాదావు’’ అని చదివి వినిపించారు. నిజమేనని ఒప్పుకున్నాడు దేశదిమ్మరి. అతనికి రెండు వందల కొరడా దెబ్బల శిక్ష విధించారు. తెల్లారేవరకూ కొరడా దెబ్బలు పడుతూనే ఉన్నాయి.సూర్యోదయం కాగానే ప్రజలంతా తమ కొత్త పాదుషాను ఘనంగా ఆహ్వానించాలని సమాధిని తవ్వారు. బయటకు రాగానే బతుకుజీవుడా అనుకుంటూ కాలిసత్తువకొద్దీ పరుగు తీశాడు ఆ దేశదిమ్మరి. ‘పాదుషా గారు ఎటు వెళుతున్నారు!’ అని అందరూ కంగారుగా అడిగారు. ‘అయ్యా! కేవలం ఒక్క గాడిద విషయంలోనే లెక్క చెప్పుకోలేకపోయాను. ఇక రాజుగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాజ్యానికి సంబంధించిన లెక్కలు ఇవ్వడం నా వల్ల అయ్యే పనికాదు’’ అందుకే నేను ఈ బాధ్యత తీసుకోదలచుకోలేదు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి పరుగు తీశాడు దేశదిమ్మరి. – ఉమైమా -
రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం: అత్యాశకు పోయి తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి రూ.30 లక్షలు దోచుకువెళ్లి మోసగాళ్ల చేతిలో తానే మోసపోయాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖలో వెలుగు చూసింది. సూర్యాబాగ్‌లోని దసపల్లా కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న పి.సాయి సురేశ్‌ను ఇటీవల నలుగురు వ్యక్తులు కలిశారు. తమ వద్ద రూ.3 కోట్ల పాత నోట్లు ఉన్నాయని రూ.30 లక్షలు ఇస్తే వాటిని ఇస్తామని వారు క్యాషియర్‌కు ఆశ చూపారు. దీంతో చిరిగిననోట్లను మార్చే అధికారం తనకు ఉండటంతో సురేశ్ బ్యాంకు నుంచి రూ.30 లక్షలు తీసుకువెళ్లి గురువారం సాయంత్రం వారికి అందజేశాడు. సురేశ్‌కు వారు రూ.500 నోట్ల మధ్య తెల్లకాగితాలు పెట్టిన కట్టలు అందజేశారు. బ్యాగును బ్యాంకుకు తీసుకువచ్చిన తర్వాత తెరిచి చూస్తే తెల్లకాగితాలు కనిపించాయి. బ్యాంకు మేనేజర్ తెన్నేటి శ్రీనివాస్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
అత్యాశ ఒక ఆధ్యాత్మిక అవరోధం!
సద్గురు జగ్గీ వాసుదేవ్ సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే! దురాశ ఒక సాపేక్ష పదం. ఒకరు రాజభవనంలో నివసించటం అవసరమని అనుకుంటారు. కాని, మరొకరు దానిని దురాశ అనుకుంటారు. ఇందుకో ఉదాహరణ చెబుతాను. ఇది కొంతకాలం క్రితం జరిగింది. నేను ఒక చెట్టు కింద నివసించే ఒక స్వామిని కలిసాను. తమకోసం ఏైదైనా చిన్న గూడును నిర్మించుకున్న ఇతర స్వాములందరినీ నిరంతరం అత ను తక్కువ చేసి మాట్లాడటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అతను తాను ప్రకృతి కల్పించే కష్టాలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ, చెట్టునీడలో జీవిస్తూ ఉంటే, మిగతా స్వాములు తమ మార్గాన్ని ఎలా తప్పారో, ఎలా పాడైపోయారో అన్నదాని గురించి, అలాగే వారు సుఖసౌఖ్యాలకు ఎలా అలవాటు పడిపోయారో అన్నదాని గురించి నిరంతరం చె ప్పేవాడు. ‘వారు ఆడంబర జీవులు, వారు వారి గుడిసెలను ఎలా అలంకరించుకున్నారో చూడండి’ అనేవాడు. ఆ గుడిసెలకు వారు చేసిన అలంకారమంతా ఏమిటంటే- వాటి ముందు వారు ఒక పూలతోట వేసారు, ఆ గుడిసెలకు కొంచెం రంగు వేసారు, అంతే! ఆ స్వామి ఇదంతా ఆడంబరం అనుకున్నాడు. అతను తాను అందరికన్నా గొప్పవాడినని అనుకోవటమే అత్యంత ఆడంబరపు చర్య అని, అదే ఎవరైనా చేయగలిగే అత్యంత తెలివితక్కువ పని అని అతనికి గుర్తు చేయవలసి వచ్చింది. అంటే, అత్యాశ చాలా సాపేక్షమయినది. మీ దృష్టిలో మీరు ఎప్పటికీ అత్యాశ గలవారు కారు. మీ ఉద్దేశ్యం ప్రకారం మీరు చేరుకోవాలనుకున్న స్థానాన్ని చేరుకున్న వారు దురాశాపరులు. మీరు ఒక మిలియన్ రూపాయలు సంపాదించటానికి ప్రయత్నించి సంపాదించలేకపోవచ్చు. కానీ, వాటిని ఎవరైనా సంపాదిస్తే, ఆ వ్యక్తి మీ దృష్టిలో దురాశాపరుడు. అదే మీరు చేస్తే, అంటే ఆ మిలియన్ రూపాయలను మీరు సంపాదిస్తే, అది దురాశ కాదు. అప్పుడు ఎవరైనా 10 మిలియన్లు సంపాదిస్తే, అది మీ ఉద్దేశ్యంలో దురాశ, ఎందుకంటే అది వేరెవరో సంపాదించారు. తగినంత లేదనే భావన మీలో ఎక్కడో బలంగా ఉండడం వల్లే పోగు చే సుకోవాలనే కోరిక మీలో అంత బలంగా ఉంది. ప్రస్త్తుతం మీ దగ్గర ఎంతున్నా, అది మీకు సరిపోవటం లేదు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న దానికన్నా మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నారు. మీరు అక్కడికి చేరిన క్షణం, మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటారు; ఇంకొంచెం; ఇంకొంచెం; ఇంకొంచెం.... అది అలా వెళుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఈ భూమి మొత్తానికీ రాజునో, రాణినో చేసినా కూడా, మీరు అక్కడితో ఆగరు. నక్షత్రాల కేసి చూస్తారు. ఎందుకంటే నిరంతరం అనంత వ్యాప్తిని కోరుకుంటున్నదేదో మీలో ఉంది. మీరు దానికి ఎంత ఇచ్చినా అది తృప్తి చెందదు. మీరు దానికి పూర్తి నక్షత్ర మండలాన్ని ఇచ్చినా, అది మరిన్ని నక్షత్ర మండలాల కోసం వెతుకుతుంది. అంటే, నేటి ప్రపంచంలో మీరు అనుకుంటున్నట్లుగా చూస్తే, మీకూ దురాశ ఉంది. ఎందుకంటే మీ అంతర్గత స్వభావం అనంత వ్యాప్తిని కోరుకొంటోంది. కానీ, మీరు ఈ అంతులేని దాహాన్ని భౌతికంగా సంతృప్తి పరచాలనుకుంటున్నారు. మీ అత్యాశలో ఎటువంటి తప్పూ లేదు; నిజానికి మీ అత్యాశ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. దానిని మీరు సరిగ్గా వ్యక్తీకరించటం లేదు, అంతే! ఇది ఎలా ఉందంటే మీరు అనంతానికి వెళ్ళాలనుకుని 1,2,3,4,5...... లెక్కబెట్టటం మొదలుపెట్టారు. అదొక అంతులేని లెక్కింపు అవుతుంది, మీరు అలా అనంతాన్ని ఎప్పటికీ చేరుకోలేరు ఇంకో విధంగా చెప్పాలంటే, మీరు ఎడ్లబండి ఎక్కి చంద్రుడిని చేరాలని అనుకోవటం ఎలాగో, ఇదీ అంతే! మీరు ఎద్దులను గట్టిగా అదిలించటం ద్వారా అక్కడికి చేరతామనుకుంటారు. మీరు ఎద్దులను చంపవచ్చు కానీ, అక్కడికి చేరుకోలేరు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే, మీకొక సరైన వాహనం కావాలి. మీలో ఉన్నది హద్దులు లేని అనంతాన్ని కావాలనుకుంటోం ది. ఈ కోరికని సంతృప్తి పరచాలనుకుంటే, అది ఖచ్చితంగా భౌతిక మార్గాల ద్వారా సాధ్యం కాదు. అందుకు మీరు భౌతికమైన వాటిని దాటి వెళ్లాలి. అది యోగా, ధ్యానాల ద్వారానే సాధ్యం! ... ప్రేమాశీస్సులతో, సద్గురు -
కవ్వింత: దురాశ
సుజిత: సంగీత కచేరి ఎక్కడ జరిగినా ఎందుకు అంత ఖర్చు పెట్టి మీ అత్తగార్ని పంపుతావు? నయన: సంగీత కచేరి అంటే మా అత్త ప్రాణాలిస్తుందట, అందుకనీ... కోపం ‘‘నీకు నీ భార్య మీద బాగా కోపం వస్తే ఏం చేస్తావ్? చెయ్యి చేసుకుంటావా?’’ ‘‘లేదు, నా ఒక్కడికే వంట చేసుకుంటాను’’. అలా అర్థమైందా? ఎస్కలేటర్ ఆపరేటర్: ఏంటి సార్ ఎస్కలేటరు దాకా వచ్చి వెనక్కు వెళ్తున్నారు? కస్టమర్: ఎస్కలేటరు మీద వెళ్లే వాళ్లు కుక్కను చేత్తో ఎత్తుకుని వెళ్లాలని రాశారు కదా. నా దగ్గర కుక్క లేదు మరి. ముల్లు ‘‘ఇదేమిటయ్యా... అరికాలి నిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయి?’’ ‘‘మొదట ఒక్క ముల్లే గుచ్చుకుంది డాక్టర్. ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రయత్నించీ... ఆందోళన భార్య: (పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి) సార్, మా ఆయన ఉదయమనగా కుక్కతో పాటు బయటకు వెళ్లారు. నాకేదో భయంగా ఉంది. ఎస్సై: ఎందుకమ్మా అంత ఆందోళన? భార్య: ఆందోళన అంటారేంటండీ, ఆ కుక్కను ఈ మధ్యే పదివేలు పెట్టి కొన్నాను. అదే ఆఖరు ‘‘హర్షవర్థనుడు ఏ యుద్ధంలో మరణించాడురా సోమేశ్వర్? ‘‘ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో సార్’’