అత్యాశ ఒక ఆధ్యాత్మిక అవరోధం!
సద్గురు జగ్గీ వాసుదేవ్
సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే!
దురాశ ఒక సాపేక్ష పదం. ఒకరు రాజభవనంలో నివసించటం అవసరమని అనుకుంటారు. కాని, మరొకరు దానిని దురాశ అనుకుంటారు. ఇందుకో ఉదాహరణ చెబుతాను. ఇది కొంతకాలం క్రితం జరిగింది. నేను ఒక చెట్టు కింద నివసించే ఒక స్వామిని కలిసాను. తమకోసం ఏైదైనా చిన్న గూడును నిర్మించుకున్న ఇతర స్వాములందరినీ నిరంతరం అత ను తక్కువ చేసి మాట్లాడటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అతను తాను ప్రకృతి కల్పించే కష్టాలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ, చెట్టునీడలో జీవిస్తూ ఉంటే, మిగతా స్వాములు తమ మార్గాన్ని ఎలా తప్పారో, ఎలా పాడైపోయారో అన్నదాని గురించి, అలాగే వారు సుఖసౌఖ్యాలకు ఎలా అలవాటు పడిపోయారో అన్నదాని గురించి నిరంతరం చె ప్పేవాడు. ‘వారు ఆడంబర జీవులు, వారు వారి గుడిసెలను ఎలా అలంకరించుకున్నారో చూడండి’ అనేవాడు. ఆ గుడిసెలకు వారు చేసిన అలంకారమంతా ఏమిటంటే- వాటి ముందు వారు ఒక పూలతోట వేసారు, ఆ గుడిసెలకు కొంచెం రంగు వేసారు, అంతే! ఆ స్వామి ఇదంతా ఆడంబరం అనుకున్నాడు. అతను తాను అందరికన్నా గొప్పవాడినని అనుకోవటమే అత్యంత ఆడంబరపు చర్య అని, అదే ఎవరైనా చేయగలిగే అత్యంత తెలివితక్కువ పని అని అతనికి గుర్తు చేయవలసి వచ్చింది.
అంటే, అత్యాశ చాలా సాపేక్షమయినది. మీ దృష్టిలో మీరు ఎప్పటికీ అత్యాశ గలవారు కారు. మీ ఉద్దేశ్యం ప్రకారం మీరు చేరుకోవాలనుకున్న స్థానాన్ని చేరుకున్న వారు దురాశాపరులు. మీరు ఒక మిలియన్ రూపాయలు సంపాదించటానికి ప్రయత్నించి సంపాదించలేకపోవచ్చు. కానీ, వాటిని ఎవరైనా సంపాదిస్తే, ఆ వ్యక్తి మీ దృష్టిలో దురాశాపరుడు. అదే మీరు చేస్తే, అంటే ఆ మిలియన్ రూపాయలను మీరు సంపాదిస్తే, అది దురాశ కాదు. అప్పుడు ఎవరైనా 10 మిలియన్లు సంపాదిస్తే, అది మీ ఉద్దేశ్యంలో దురాశ, ఎందుకంటే అది వేరెవరో సంపాదించారు.
తగినంత లేదనే భావన మీలో ఎక్కడో బలంగా ఉండడం వల్లే పోగు చే సుకోవాలనే కోరిక మీలో అంత బలంగా ఉంది. ప్రస్త్తుతం మీ దగ్గర ఎంతున్నా, అది మీకు సరిపోవటం లేదు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న దానికన్నా మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నారు. మీరు అక్కడికి చేరిన క్షణం, మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటారు; ఇంకొంచెం; ఇంకొంచెం; ఇంకొంచెం.... అది అలా వెళుతూనే ఉంటుంది.
మిమ్మల్ని ఈ భూమి మొత్తానికీ రాజునో, రాణినో చేసినా కూడా, మీరు అక్కడితో ఆగరు. నక్షత్రాల కేసి చూస్తారు. ఎందుకంటే నిరంతరం అనంత వ్యాప్తిని కోరుకుంటున్నదేదో మీలో ఉంది. మీరు దానికి ఎంత ఇచ్చినా అది తృప్తి చెందదు. మీరు దానికి పూర్తి నక్షత్ర మండలాన్ని ఇచ్చినా, అది మరిన్ని నక్షత్ర మండలాల కోసం వెతుకుతుంది. అంటే, నేటి ప్రపంచంలో మీరు అనుకుంటున్నట్లుగా చూస్తే, మీకూ దురాశ ఉంది. ఎందుకంటే మీ అంతర్గత స్వభావం అనంత వ్యాప్తిని కోరుకొంటోంది. కానీ, మీరు ఈ అంతులేని దాహాన్ని భౌతికంగా సంతృప్తి పరచాలనుకుంటున్నారు.
మీ అత్యాశలో ఎటువంటి తప్పూ లేదు; నిజానికి మీ అత్యాశ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. దానిని మీరు సరిగ్గా వ్యక్తీకరించటం లేదు, అంతే!
ఇది ఎలా ఉందంటే మీరు అనంతానికి వెళ్ళాలనుకుని 1,2,3,4,5...... లెక్కబెట్టటం మొదలుపెట్టారు. అదొక అంతులేని లెక్కింపు అవుతుంది, మీరు అలా అనంతాన్ని ఎప్పటికీ చేరుకోలేరు
ఇంకో విధంగా చెప్పాలంటే, మీరు ఎడ్లబండి ఎక్కి చంద్రుడిని చేరాలని అనుకోవటం ఎలాగో, ఇదీ అంతే! మీరు ఎద్దులను గట్టిగా అదిలించటం ద్వారా అక్కడికి చేరతామనుకుంటారు. మీరు ఎద్దులను చంపవచ్చు కానీ, అక్కడికి చేరుకోలేరు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే, మీకొక సరైన వాహనం కావాలి.
మీలో ఉన్నది హద్దులు లేని అనంతాన్ని కావాలనుకుంటోం ది. ఈ కోరికని సంతృప్తి పరచాలనుకుంటే, అది ఖచ్చితంగా భౌతిక మార్గాల ద్వారా సాధ్యం కాదు. అందుకు మీరు భౌతికమైన వాటిని దాటి వెళ్లాలి. అది యోగా, ధ్యానాల ద్వారానే సాధ్యం!
... ప్రేమాశీస్సులతో,
సద్గురు