రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని.. | Greed deceived the bank cashier | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..

Oct 15 2016 3:43 AM | Updated on Sep 4 2017 5:12 PM

రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..

రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..

అత్యాశకు పోయిన క్యాషియర్‌ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు.

సాక్షి, విశాఖపట్నం: అత్యాశకు పోయి తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి రూ.30 లక్షలు దోచుకువెళ్లి మోసగాళ్ల చేతిలో తానే మోసపోయాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖలో వెలుగు చూసింది. సూర్యాబాగ్‌లోని దసపల్లా కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న పి.సాయి సురేశ్‌ను ఇటీవల నలుగురు వ్యక్తులు కలిశారు.

తమ వద్ద రూ.3 కోట్ల పాత నోట్లు ఉన్నాయని రూ.30 లక్షలు ఇస్తే వాటిని ఇస్తామని వారు క్యాషియర్‌కు ఆశ చూపారు. దీంతో చిరిగిననోట్లను మార్చే అధికారం తనకు ఉండటంతో సురేశ్  బ్యాంకు నుంచి రూ.30 లక్షలు తీసుకువెళ్లి గురువారం సాయంత్రం వారికి అందజేశాడు. సురేశ్‌కు వారు రూ.500 నోట్ల మధ్య  తెల్లకాగితాలు పెట్టిన కట్టలు అందజేశారు. బ్యాగును  బ్యాంకుకు తీసుకువచ్చిన తర్వాత తెరిచి చూస్తే తెల్లకాగితాలు కనిపించాయి. బ్యాంకు మేనేజర్ తెన్నేటి శ్రీనివాస్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement