bank cashier
-
22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి
హస్తినాపురం: రూ. 22.53 లక్షలతో ఉడాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటూ వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని బ్యాంకు ఆఫ్ బరోడా (బీఓబీ) క్యాషియర్ ప్రవీణ్‌కుమార్ హయత్‌నగర్ కోర్టులో సోమవారం లొంగిపోయాడు. మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు విరక్తి చెంది అవమానం భరించలేక మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పారు. తాను వారణాసి, గోవా వెళ్లలేదని, వనస్థలిపురం నుంచి నేరుగా నల్లగొండ జిల్లా చిట్యాలకు బైక్‌పై వెళ్లి అక్కడ బైక్‌ను వదిలేసి ఆటోలో నల్లగొండకు, అక్కడి నుంచి బస్సులో దేవరకొండ మీదుగా జడ్చర్లకు వెళ్లానన్నారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వర్షంలో తడిచి ఓ గ్రామానికి వెళ్లి ఇతరుల ఫోన్ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మీడియాకు సెల్ఫీ వీడియో పెట్టానని తెలిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన బాధలు చెప్పుకోవడానికే ఇక్కడకి వచ్చానని, ఇప్పటికీ తనకు జరిగిన అవమానానికి బతకాలని లేదని అన్నారు. బ్యాంకులో అంతర్జాతీయ స్థాయి కుంభకోణం: ప్రవీణ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణం జరుగుతోందని ప్రవీణ్ ఆరోపించారు. బ్యాంకులో లాకర్‌కు పెట్టాల్సిన సీసీ కెమెరాలు వాటికి కాకుండా కిందికి పెట్టారని, తాను బయటికి రాగానే నిజాలను సాక్ష్యాలతో బయటపెడతానని కోర్టు బయట మీడియాకు చెప్పారు. తనను ఈ స్థాయికి తెచ్చిన వారిని వదిలిపెట్టబోనని, అన్ని నిజాలు త్వరలోనే బట్టబయలు చేస్తానని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రవీణ్ గత మంగళవారం బ్యాంకుకు వచ్చాక కాసేపటికే కడుపు నొప్పి వస్తోందని చీఫ్ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో కంగారు చెందిన చీఫ్ మేనేజర్ క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి సిబ్బంది సమక్షంలో నగదు లెక్కించగా రూ. 22.53 లక్షలు తక్కువ వచ్చింది. దీంతో ప్రవీణ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని బ్యాంక్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. -
కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతోంది. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, కనీస భౌతిక దూరాన్ని పాటించడం లాంటి చర్యలు గత పదిరోజులుగా దాదాపు దేశ ప్రజలందరికి అలవాటుగా మారిపోయింది. అయితే కరెన్సీ నోట్ల మీద, పేపర్ మీద కూడా వైరస్ తిష్టవేసుకుని కూచుంటుందని, జాగ్రత్తలు అవసరమన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న వైనం చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గా వుంటూ, ఎన్నో ఆసక్తికర, విజ్ఞాన దాయక వీడియోలను పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను ట్వీట్ చేయడం విశేషం. వాట్సాప్ వండర్ బాక్స్ లో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఈ టెక్నిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, క్యాషియర్ సృజనాత్మకతను మాత్రం మెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ లాంటి నియమాలను పాటించిన సదరు బ్యాంకు ఉద్యోగి వినియోగదారుడు నుంచి, చెక్కును ప్లకర్ తో అందుకోవడం, ఆ తరువాత దాన్ని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేసి మరీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రక్రియ కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కాగా లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలందరూ ఇంటి పరిమితమైనప్పటికీ ప్రజల సౌకర్యార్ధం కొన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్యం, కిరాణా, బ్యాంకింగ్, మీడియా వంటి ముఖ్యమైన సేవలకు అనుమతి వుంది. అయినా దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఉదంతం అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ In my #whatsappwonderbox I have no idea if the cashier’s technique is effective but you have to give him credit for his creativity! 😊 pic.twitter.com/yAkmAxzQJT — anand mahindra (@anandmahindra) April 4, 2020 -
శృంగార క్యాషియర్‌పై కేసు
తిరువొత్తియూరు: పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న క్యాషియర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుచ్చి జిల్లా మణప్పారై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకోటై విరాలిమలైలోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పలువురు స్త్రీలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. (శృంగార క్యాషియర్ ) దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బ్యాంకులో ఎడ్విన్ జయకుమార్ నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, అతను బ్యాంక్‌కు వచ్చే అందమైన మహిళల సెల్‌ఫోన్ నంబర్లను నోట్ చేసుకుని వారితో మాట కలిపి తన బుట్టలో వేసుకుంటాడని, తరువాత వారితో శృంగారాన్ని కొనసాగిస్తాడని తెలిసింది. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఓ మహిళను జయకుమార్ తన వైపు తిప్పుకుని ఆమెతో రాసలీలలు నడిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతని కోసం విచారణ చేస్తున్నారు. -
శృంగార క్యాషియర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు...ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్ఫోన్లు, వాటిల్లో జయకుమార్ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూములో వీడియోలు, ఎస్ఎంఎస్లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు, భర్త సోదరి, అత్తవారింటి ఇతర మహిళా బంధువులకు చెప్పుకుని విలపించింది. అయితే వారేమీ పట్టించుకోలేదు. అయితే తన అంతర్గత విషయాలను కుటుంబసభ్యులకు చెప్పిందని జయకుమార్ అగ్రహించి భార్యను తిట్టిపోశాడు. అంతేకాకుండా ‘నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు. అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్...భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్... కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్తో.. బ్యాంక్‌కు క్యాషియర్ కన్నం
సాక్షి, కోవూరు: ‘అతను బ్యాంక్‌లో క్యాషియర్. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో పనిచేస్తున్న బ్యాంక్‌కే కన్నం వేశాడు. ఈ వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. వివరాలను బుధవారం కోవూరు సీఐ జీఎల్ శ్రీనివాసులు స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. మండల కేంద్రమైన అల్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దోసరి నాగబాబు సుమారు మూడేళ్లుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. అతడికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. పెద్ద మొత్తంలో నగదు పోయింది. ఈక్రమంలో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంక్‌కే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ నాగబాబు, కస్టోడియన్ మునిస్వామిలు సాయంత్రం లెక్క చూసి లాకర్లో డబ్బు పెట్టాలి. లాకర్ నుంచే నగదు చోరీ చేయాలని భావించిన నాగబాబు మునిస్వామిని నమ్మించడం ప్రారంభించాడు. నగదు పెట్టే సమయంలో కస్టోడియన్‌ను ఏమార్చి లెక్క మొత్తం సరిపోయిందని చెప్పేవాడు. అదే సమయంలో కొంత నగదు, బంగారు ఆభరణాలు తీసి బ్యాంక్‌లో దాచిపెట్టేవాడు. ఈవిధంగా కొద్దిరోజులపాటు జరిగింది. ఈనెల 16వ తేదీన కస్టోడియన్ బ్యాంక్‌కు వెళ్లి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు చూడగా తేడా వచ్చింది. ఈక్రమంలో మేనేజర్ రవించంద్రకు చెప్పాడు. వారు సీసీ టీవీ ఫుటేజీ చూశారు. అందులో నాగబాబు పలుమార్లు నగదు, ఆభరణాలు తీసుకెళ్లినట్లుగా రికార్డైంది. దీంతో మేనేజర్ అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రఘునాథ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగబాబు కస్టోడియన్‌ను ఏమార్చి రూ.5.40 లక్షలు, కొంత బంగారు ఆభరణాలు (మొత్తం కలిపి రూ.6.32 లక్షలు) చోరీ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం నిందితుడు నాగబాబు అల్లూరు పాత బస్టాండ్ సెంటర్లో ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇందులో కస్టోడియన్ పాత్ర లేదని, అతడిని నమ్మించి నాగబాబు నగదు, ఆభరణాలు అపహరించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బంది యానాదయ్య, మురళి, వేణు, గౌస్‌బాషా, తిరుపతిస్వామి, దశరథ్, చంద్రలను సీఐ అభినందించారు. కేసును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, కేవీ రాఘవారెడ్డి పర్యవేక్షణలో ఛేదించామన్నారు. -
బ్యాంక్ క్యాషియర్ దారుణ హత్య
బరంపురం: గంజాం జిల్లా ధారకోట్ సమితి ముంటమరాయి గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముండమరాయి గ్రామంలో గల కళాశాల ప్రాంగణంలో ఓ మృతదేహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న ధారకోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తం మడుగులో పడి ఉన్న మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతదేహం దగ్గర దొరికిన కొన్ని ఆధారాలను బట్టి మృతుడిని వినోదర్ బెహరాగా గుర్తించారు. ఆయన ముండమోరై ఆంధ్రా బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన అనంతరం హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ వాళ్లనే బురిడీ కొట్టించిన ఘనుడు
-
రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం: అత్యాశకు పోయి తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి రూ.30 లక్షలు దోచుకువెళ్లి మోసగాళ్ల చేతిలో తానే మోసపోయాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖలో వెలుగు చూసింది. సూర్యాబాగ్‌లోని దసపల్లా కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న పి.సాయి సురేశ్‌ను ఇటీవల నలుగురు వ్యక్తులు కలిశారు. తమ వద్ద రూ.3 కోట్ల పాత నోట్లు ఉన్నాయని రూ.30 లక్షలు ఇస్తే వాటిని ఇస్తామని వారు క్యాషియర్‌కు ఆశ చూపారు. దీంతో చిరిగిననోట్లను మార్చే అధికారం తనకు ఉండటంతో సురేశ్ బ్యాంకు నుంచి రూ.30 లక్షలు తీసుకువెళ్లి గురువారం సాయంత్రం వారికి అందజేశాడు. సురేశ్‌కు వారు రూ.500 నోట్ల మధ్య తెల్లకాగితాలు పెట్టిన కట్టలు అందజేశారు. బ్యాగును బ్యాంకుకు తీసుకువచ్చిన తర్వాత తెరిచి చూస్తే తెల్లకాగితాలు కనిపించాయి. బ్యాంకు మేనేజర్ తెన్నేటి శ్రీనివాస్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.