
బరంపురం: గంజాం జిల్లా ధారకోట్ సమితి ముంటమరాయి గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముండమరాయి గ్రామంలో గల కళాశాల ప్రాంగణంలో ఓ మృతదేహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న ధారకోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తం మడుగులో పడి ఉన్న మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
మృతదేహం దగ్గర దొరికిన కొన్ని ఆధారాలను బట్టి మృతుడిని వినోదర్ బెహరాగా గుర్తించారు. ఆయన ముండమోరై ఆంధ్రా బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన అనంతరం హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment