despair
-
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
అమృత బిందువులు
♦ బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే... ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం గొప్పది. అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే... బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి. అవసరాల్ని తీర్చని ఆస్తుల కంటే... ఆకల్ని తీర్చే అన్నం గొప్పది. ♦ వయస్సు పెరిగే కొద్దీ సమాజంలో, మనిషి జీవితం ఆప్యాయతకి, మంచితనానికి చిరునామా, అలంకరణ కావాలి. కానీ, అహంకారానికి, ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు. ♦ ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అత్యాశ అధఃపాతాళానికి దారితీస్తుంది. నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది. ♦ సేవచేయడం, శ్రద్ధగా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, ΄పాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తి శిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే మహోన్నత మార్గాన మనిషిని నడిపిస్తాయి. ♦ నిన్నటి కన్నా నేడు మిన్నగా... నేటికన్నా మిన్నగా రేపు జీవించాలి. ♦ జీవితంలో వాస్తవం ఉండాలి. ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి. ♦ మన జీవితాన్ని మనమే రూపు దిద్దుకోవాలి. -
దిక్కుతోచని స్థితిలో స్టేట్స్‌మెన్ చంద్రబాబు
-
పాలడెయిరీ డీలర్లకూ తప్పని కరెన్సీ కష్టాలు
-
ఆ ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
సత్యవేడు ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి తిరుపతిలో ఎమ్మెల్యే అల్లుడిదే హవా శ్రీకాళహస్తిలో చెర్మైన్, కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం చంద్రగిరిలో మూడు ముక్కలాట జీడీ నెల్లూరులో కొరవడిన సఖ్యత కుప్పంలో సీఎం, పీఏ తీరుపై నాయకుల్లో వ్యతిరేకత తిరుపతి: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో పార్టీ నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయికి వర్గవిభేదాలు చేరాయి. సత్యవేడులో సామాన్యుల గోడు సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య తండ్రి పెత్తనంపై ద్వితీయశ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నియోజకర్గానికే చెందిన పిచ్చాటూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఇటీవల తిరుపతిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తమను పార్టీలో అవమానాలకు గురిచేస్తున్నారని ప్రకటించడం గమనార్హం. జిల్లాలోని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కన్నీటిపర్యంతమయ్యారు. తిరుపతిలో అల్లుడిదే పరపతి తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు, ఆయన కోటరీ పెత్తనంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నగర అధ్యక్షుడి తీరుపై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రెండు సామాజికవర్గాల మధ్య పోరు నడుస్తోంది. చంద్రగిరిలో తలో దారి చంద్రగిరిలో దేశం నాయకుల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. దీనికి తోడు చినబాబు, గల్లా వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జన చైతన్యయాత్రలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. గంగాధర నెల్లూరులో గరం గరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నియోజవర్గ ఇన్చార్జి కుతూహలమ్మ, పాతగుంట మనోహర్‌నాయుడు వర్గాల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం సాగుతోంది. శ్రీకాళహస్తిలో చిర్రుబుర్రు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌కు, అదేపార్టీ కౌన్సిలర్లకు మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతూనే వుంది. పార్టీలో దాదాపు 90 శాతానికి పైగా కౌన్సిలర్లు చైర్మన్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కౌన్సిలర్లుగా ఎన్నికై 18 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు తామేమీ చేయలేకపోయామని బహిరంగంగా వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలతో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సైతం తలపట్టుకుంటున్నారు. అన్నింటా అసంతృప్తి మంట పీలేరులో సైతం మూడు గ్రూపుల నడుమ కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, ఆయన పీఏ తీరుపై నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చిత్తూరులో రెండు సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. నగరి నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దేశం నేతలు, గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్గానికి దూరంగా ఉంటున్నారు. మదనపల్లిలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు అధినేత తల బొప్పికట్టిస్తున్నాయి. ఇలా ముఖ్యమంత్రి సొంతజిల్లాలోని టీడీపీ నేతల మధ్య అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. జిల్లాలో నెలకొన్న గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చాలని ముఖ్యమంత్రి, చినబాబు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టడంతో, పార్టీ పెద్దలు అందోళన చెందుతున్నారు. ఈ తగాదాలు ఏ తీరానికి చేరుతాయోనని చర్చించుకుంటున్నారు. -
పోరాటమా.. విశ్రాంతా?
నిర్వేదంలో జానారెడ్డి కలుషిత రాజకీయాల్లో కొనసాగడం బాధాకరం దిగజారుడుతనంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ డబ్బులను వెదజల్లి అధికారం లాక్కోవాలని టీడీపీ ప్రయత్నం నీతి బాహ్యమైన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై ప్రతిపక్షనేత జానారెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. కలుషిత రాజకీయాలను చూస్తూ కూడా రాజకీయాల్లో ఉండడం బాధాకరమని, ఈ రాజకీయాలపై పోరాటం చేయాలో, విశ్రాంతి తీసుకోవాలో తెలియడం లేదని ఆయన వాపోయారు. మంగళవారం అసెంబ్లీలో శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఏడాది కాలంలో జరిగిన ఫిరాయింపులపై జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడుతనంతో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, అధికారాన్ని లాక్కోవాలని టీడీపీ డబ్బులను వెదజల్లుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అధికారపార్టీలోకి చేర్చుకుని మంత్రిని చేయడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి, బెదిరించి అధికారపార్టీలో చేర్చుకున్నారని జానారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సంఘటనలు చూడడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనేది శ్రేయోభిలాషులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకొంటే కాంగ్రెస్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తానని చెప్పారు. నీతి బాహ్యమైన రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. దిగజారుడు, కలుషిత రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారని జానా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత గెలుపు తమ పార్టీ ఎమ్మెల్యేల ఐక్యతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని పేర్కొన్నారు. ఏపీ సీఎం ప్రత్యక్ష బాధ్యుడు.. రాజకీయాల్లో అనైతిక ఘటనలకు ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యక్ష బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వీటికి బాధ్యుడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అయితే, ఫిరాయింపులకు కారణమైన దొంగల సంగతేంటని ప్రశ్నించారు. -
మానసిక ధైర్యంతో ముందుకు..
మలేసియాటౌన్‌షిప్: నిరాశ, నిస్పృహలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన వారిలో మానసిక ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామని పలు స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగాలయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం 2కే వాక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ రాందేవ్రావు ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగులు, ఒంటరితనం, నిస్సహాయత, నిరాశ, కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఆత్మహత్యకు దారితీస్తున్నాయన్నారు. ఆ సమయంలో ఆప్తులు, స్నేహితులు, తోటి నివాసితులు ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నంను నివారించవచ్చన్నారు. వీరికోసం ఆత్మహత్య నివారణ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 040-46004600 నంబర్‌కు సంప్రదించి వారిని ఈ కేంద్రంలో చేర్చాలన్నారు. వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా చికిత్స చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి రేష్మారాథోర్, నటుడు నవీన్‌చంద్ర ముఖ్య అతిథులుగా హాజరై 2కే వాక్‌ను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, స్థానికులు ఆత్మహత్యలను నివారించాలని నినాదాలు చేస్తూ జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోషిణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు టింకి భరద్వాజ్, మాక్రొ ఫౌండేషన్ సంస్థకు చెందిన సుబ్బారావు, మాక్రొ గ్రూపు డెరైక్టర్ మహేష్ మాల్నిధి, అరుణాచలం సంస్థ డెరైక్టర్ త్యాగరాజన్, సేవా స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ జవహర్లాల్ నెహ్రూ, ఐపీడీజీ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ లయన్ దీపక్ భట్టాచార్జీ, వైడబ్ల్యూసీఏ ఆఫ్ సికింద్రాబాద్ సంస్థ కోశాధికారి నియోమి ఫ్రాన్సిస్, సీవోవీఏ సంస్థ డెరైక్టర్ మాజర్హుస్సేన్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్ఎన్. మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ లయన్ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.