మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే! | Parliament Special Session Updates: Women's Reservation Bill Passed In Lok Sabha - Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన ఎంపీలు వీళ్లే!

Published Wed, Sep 20 2023 8:04 PM | Last Updated on Wed, Sep 20 2023 8:38 PM

Wowens Reservation Bill Passed In Lok Sabha For The First Time - Sakshi

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్‌లో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. బంపర్‌ మెజార్టీతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’కు లోక్‌సభ ఎంపీలు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. మూడవ రోజు బుధవారం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై. ఆపై ఓటింగ్‌ ద్వారా బిల్లు ఆమోదం పొందగా.. కొత్త పార్లమెంట్‌లో పాసైన తొలి బిల్లుగా రికార్డు సృష్టించింది.

ఓటింగ్‌ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి. ఇద్దరు మజ్లిస్‌ ఎంపీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్‌.. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌(ఔరంగాబాద్‌, మహారాష్ట్ర) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు పాస్ అయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు.

ఇక ఇప్పుడు లోక్‌సభ ఆమోదంతో రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్‌ తర్వాత 2029 ఎ‍న్నికల సమయంలో మహిళా రిజర్వేషన్‌ కోటా అమలుకానుంది. 

కాగా టీ కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ మీటింగ్‌తో ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు హాజరుకాలేకపోయారు. రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మహిళా బిల్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు.

లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు (సెప్టెంబర్‌ 21)న రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది.  
చదవండి: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement