న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్‌సభలో మోక్షం కలిగించారన్నారు.
ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.
అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు.
#WATCH | Delhi: On Union Home Minister Amit Shah's statement in parliament, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "His (HM Amit Shah) statement is hypocritical because a commitment made to the women of the country 9 and a half years ago in the 2014 manifesto and coming and… pic.twitter.com/LV61OqKV5N
— ANI (@ANI) September 20, 2023
ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
Comments
Please login to add a commentAdd a comment