అల్పాదాయ కుటుంబాలకు ఉచిత రేషన్
25 హామీలతో బీజేపీ మేనిఫెస్టో
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే కఠినమైన నిబంధనలతో మత మార్పిడి నిరోధక చట్టం తెస్తామని బీజేపీ ప్రకటించింది. అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుతామని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం–2024’ పేరిట బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో 25 హామీలను పొందుపర్చారు.
→ బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అడ్డుకోవడానికి కఠిన చట్టం
→ లడ్కీ బెహన్ యోజన కింద మహిళలకు ఆర్థిక సాయం నెలకు రూ.1,500 నుంచి రూ.2,100
→ యువతకు 25 లక్షల ఉద్యోగాల సృష్టి. 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్
→ అక్షయ్ అన్న యోజన కింద అల్పాదాయ వర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు
→ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ అండ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రైనింగ్ హబ్‌గా మహారాష్ట్ర అభివృద్ధి
→ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష సెంటర్ల ద్వారా కొత్తగా 10 లక్షల మంది బిజినెస్ లీడర్ల తయారీ
→ 2027 నాటికి 50 లక్షల మంది లఖ్‌పతతీ దీదీల సృష్టి. 500 సంఘాలతో పారిశ్రామిక క్లస్టర్
→ ఆధునిక ఏరోనాటికల్, స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లుగా నాగపూర్, పుణే, ఛత్రపతి శంభాజీనగర్, నాసిక్, అహిల్యానగర్
అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలా: అమిత్ షా
జల్‌గావ్/బుల్దానా: మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారడం ఆ కూటమికి అలవాటేనన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలంటూ ఉలేమా కౌన్సిల్ చేసిన డిమాండ్‌కు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అంగీకరించారన్నారు.
ఆదివారం మహారాష్ట్రలోని జల్‌గావ్, బుల్దానాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అమిత్ షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు కట్టబెట్టానికి ఎంవీఏ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని గుర్తుచేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎంవీఏ నేతలు అధికార దాహంతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment