
గత నాలుగేళ్లలో ఏపీలో మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా..
సాక్షి, గుంటూరు: లోక్‌సభలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడంపై తనకెంతో గర్వకారణంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన.
మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత 4 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించాము. కలిసికట్టుగా.. ప్రకాశవంతమైన, మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం! అని తన సందేశంలో పేర్కొన్నారాయన.
I am proud to extend @YSRCParty’s support to the #WomenReservationBill.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2023
Empowering our women is of utmost importance to us. We achieved this in Andhra Pradesh not only through the schemes and initiatives introduced in the past 4 years, but also by ensuring equitable…
అంతకు ముందు.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రకటించారు. ఈ బిల్లు త్వరగా అమలు చేయాలని కోరారాయన. అంతేకాదు.. ఏపీలో సీఎం జగన్ మహిళా పక్షపాతిగా ఉన్నారని, అన్ని పథకాలను మహిళల పేరు మీదే అమలు చేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల్లో సైతం మహిళలకు పెద్దపీట వేశారని ఎంపీ మిథున్‌రెడ్డి గుర్తు చేశారు.