
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఉదయం 11:30కు అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో భేటీలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదానికి కేంద్రం తీసుకురానుంది.
ఈ బిల్లులు అన్నీ ఇప్పటికే ఉభయసభల్లో ప్రవేశ పెట్టినందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు తెలిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అయ్యింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది.
ఇదీ చదవండి: రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా..