
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాగులు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహిణ కోసం అధికారులు ఉభయ సభల్లోను ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. చదవండి: (పార్లమెంట్ ‘ప్రశ్నోత్తరాల’పై వేటు!)