నల్ల దుస్తులతో అసెంబ్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు | YSRCP protest in black dress and attends assembly | Sakshi
Sakshi News home page

నల్ల దుస్తులతో అసెంబ్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు

Published Sat, Mar 19 2016 7:55 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

నల్ల దుస్తులతో అసెంబ్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు - Sakshi

నల్ల దుస్తులతో అసెంబ్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు

హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ శాసనసభలోకి అనుమతించక పోవడంపై నిరసన తెలపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. నిరసనలో భాగంగా శనివారం నల్ల దుస్తులతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఆర్కే రోజాను సభలోకి అనుమతించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టనున్నారు. న్యాయస్థానాలను గౌరవించనందుకు నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. నేడు బడ్జెట్ లోని పలు డిమాండ్లపై చర్చ జరగనుంది.

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శుక్రవారం ఏపీ శాసనసభలోకి అనుమించక పోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్ఆర్ సీపీ తమ ఆందోళనను తీవ్రతరం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement