విపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా | assembly suspended due to ysrcp protest over mla roja row | Sakshi
Sakshi News home page

విపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా

Published Sat, Mar 19 2016 9:47 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

assembly suspended due to ysrcp protest over mla roja row

హైదరాబాద్:
ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతూనే ఉన్నా... నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు.

అంతకుముందు అధికార పక్ష సభ్యులే ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. అధికారపక్ష సభ్యులతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఏకపక్షంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేశారు. అయినా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement