ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం మరోసారి వాయిదా పడింది.
హైదరాబాద్:
ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు.