'ఈ రోజైనా సభలోకి రానిస్తారా?'
హైదరాబాద్: ఏపీ శాసనసభలోకి అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం తనను అడ్డుకుంటుందుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తమ పార్టీకి న్యాయవాదుల మీద, చట్టాల మీద చాలా నమ్మకం ఉందని పేర్కొన్నారు. మా హక్కుల పరిరక్షణకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు. కోర్టు నుంచి వచ్చి సెక్రటరీకి లేఖ ఇచ్చారు. అయినా ఏం జరిగిందో చూశారు, టీడీపీ తనను అసెంబ్లీలోకి రాకుండా చేసిందని చెప్పారు.
తాను ఎందుకు సభలోకి రాకూడదో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటకుపైగా శుక్రవారం ఎండలో ఉండి సమాధానం కోసం వేచిచూసినా లాభం లేకపోయిందన్నారు. దీంతో వెంటనే గవర్నర్ నరసింహన్ ని కలవడానికి వెళ్లాల్సి వచ్చింది. తనను ఈరోజైనా సభలోకి రానిస్తారో లేదో, ఎందుకు అనుమతించరో చెప్పాలని ఆ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. రోజాను అనుమతించక పోవడంపై నిరసన తెలుపుతూ ఆ పార్టీ సభ్యులు నల్ల దుస్తులతో సభకు వచ్చారు.