ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా దినోత్సవాన్ని మర్చిపోయారు. ప్రత్యేకంగా మహిళా దినోత్సవంపై మాట్లాడాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరగా తన సీట్లో లేచిన ఆయన ఆ విషయం కాకుండా ఇతర విషయాలు మాట్లాడారు.