కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవాలు: యనమల
హైదరాబాద్: ఈ సంవత్సరపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని కర్నూలు జిల్లాలో నిర్వహిస్తామని ఆర్ధికశాఖ, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సౌకర్యాలు, వసతుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని యనమల ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ నెలలో ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. రైతు రుణాలు తప్పకుండా మాఫీ చేస్తాం అని మంత్రి యనమల స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై రైతులు ఆందోళన పడవద్దని యనమల అన్నారు.