నీళ్లు నమిలిన ఏపీ మంత్రి | ravela kishore Babu not even reply for single question | Sakshi
Sakshi News home page

నీళ్లు నమిలిన ఏపీ మంత్రి

Published Fri, Mar 18 2016 11:44 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

నీళ్లు నమిలిన ఏపీ మంత్రి - Sakshi

నీళ్లు నమిలిన ఏపీ మంత్రి

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి రావెల్ కిషోర్ బాబు నీళ్లు నమిలారు. శాసనసభకు సర్వాధికారాలు ఉన్నాయని పేర్కొంటున్న నేపథ్యంలో ఎందుకు హైకోర్టులో అప్పీలుకు వెళ్లారని మీడియా ప్రతినిధులు మంత్రి రావెలను ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండానే మంత్రి ఈ విషయంపై దాటవేశారు. దళిత కోణంలోనే మాట్లాడాలంటూ మరో ఎమ్మెల్యే యామినీ బాలకు రావెల సూచించారు.

మీడియా ప్రతినిధుల సమక్షంలోనే దళిత కోణం వినిపించాలని రావెల పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై మీడియా అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన బదులివ్వలేక నీళ్లు నమిలారు. రోజాను అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వలేదన్న ప్రశ్నకు కూడా మంత్రి రావెల కిషోర్ బాబు నుంచి సరైన జవాబు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement