
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యల వివరాలను ఈ నెల 4లోగా సమర్పించాలని, 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివారం బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్రపతి ఉత్తర్వులు, అసెంబ్లీ సమావేశాలపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై కొన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను పరిశీలకులకు పంపామన్నారు.