
బడ్జెట్ సమావేశాల తర్వాత నోటిఫికేషన్లు: ఈటెల
శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
వరంగల్, వీణవంక/కమలాపూర్: శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్‌లోని లాల్‌బహుద్దూర్ కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల కోసం ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలలల్లో పని చేసే పార్ట్‌టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దొడ్డు బియ్యం తినేవాళ్లందరికీ ఆహార భద్రత కార్డులు ఇస్తామని మంత్రి రాజేందర్ అన్నారు.