'ప్రజలకు విశ్వాసం కలిగేలా..'
బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ : బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతులతో తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరే ముందు సోమవారం ఉదయం ఈటల విలేకరులతో ముచ‍్చటించారు. అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణను తెచ్చుకున్నామని గుర్తుచేశారు.
ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండాలనే సంకల్పంతో.. ఏ వర్గాలు అయితే అభివృద్ధి చెందలేదో.. ఆ వర్గాల అభివృద్ధే ఎజెండాగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలగలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు.