అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, పఠాన్‌కోట్‌లో ఉగ్ర దాడి, జేఎన్‌యూ వివాదం వంటి అంశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కుదిపేయనున్న నేపథ్యంలో
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, పఠాన్‌కోట్‌లో ఉగ్ర దాడి, జేఎన్‌యూ వివాదం వంటి అంశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కుదిపేయనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం విపక్ష నేతలతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు.
గత సమావేశాల్లో వివిధ అంశాలపై తమను పరిగణనలోకి తీసుకోలేదని విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై విరుచుకుపడిన నేపథ్యంలో మోదీ తొలిసారిగా ఈ భేటీ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. అయితే ఇది అఖిలపక్ష సమావేశం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న లేదా ఆమోదించాలనుకుంటున్న బిల్లుల గురించి ఈ భేటీలో చర్చ ఉండదని తెలిపాయి.