
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాయిదా?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో సమావేశాలు వాయిదా పడొచ్చని సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ పదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అక్టోబర్ నెలకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల వారీగా 14 టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆరుగురు సలహాదారుల నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఈ విషయాలన్నింటిపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల విషయంతో పాటు టాస్క్ఫోర్స్ కమిటీల విషయాన్ని కూడా ఈ సమావేశంలో గవర్నర్ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం.