సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక తీర్మానంతో పాటు ఐదు బిల్లులను శాసనసభ ఆమోదించింది. వాల్మీకి బోయలను, కాయస్త లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. మున్సిపల్, పంచాయతీరాజ్, జయశంకర్ యూనివర్సిటీ సవరణ బిల్లులు, రెండు ద్రవ్య వినిమయ బిల్లులు కలుపుకొని మొత్తం ఐదు బిల్లులను ఆమోదించింది. అసెంబ్లీ చివరి రోజు ఆదివారం ప్రశ్నోత్తరాల తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పత్రాలను మంత్రి జగదీశ్‌రెడ్డి సభకు సమర్పించారు.
రాష్ట్రంలో ఫీజుల రీయింబర్స్‌మెంటుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు. బిల్లులను ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment