సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది రూ.6,185.97 కో ట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 6,295 కోట్లు కే టాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఆరో గ్య మిషన్ పథకాలకు మాత్రం అధిక నిధులు కేటాయించింది. ఔషధాల కొనుగోలుకు మాత్రం గతంతో పోలిస్తే ఈ ఏడాది నిధులు తగ్గించింది.
ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు ఇలా..
- గతేడాది మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణంగా రూ. 720.12 కోట్లు.
- ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గతేడాది మాదిరిగానే రూ. 211.86 కోట్లు, పెన్షన్‌దారుల ఆరోగ్య పథకానికి రూ. 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి రూ. 45.88 కోట్లు కలిపి మొత్తం కేటాయింపులు రూ. 410.35 కోట్లు.
- ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని బీపీఎల్ కుటుంబాలు నిమ్స్‌లో చికిత్స పొందితే వారికి సాయం చేసేందుకు రూ. కోటి కేటాయింపు. ళీఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో ఈసారి రూ.1,213 కోట్లు కేటాయింపులు.
- నిమ్స్‌లో వేతనాల పెంపును అమలు చేయడంలో భాగంగా ఈసారి రూ. 213. 85 కోట్లు (గతేడాది రూ. 113.85 కోట్లు) కేటాయింపు.
- వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ పరికరాల కొనుగోలుకు రూ. 13.54 కోట్లు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, భద్రత కార్మికులకు రూ. 48.15 కోట్లు కేటాయింపు.
- వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల బలోపేతం చేసేందుకు రూ. కోటి. ళీవైద్య విద్యలో సర్జికల్ వస్తువుల కోసం రూ.3 కోట్లు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది కోసం రూ. 40 కోట్లు. ళీ ఔషధాల కొనుగోలుకు రూ. 254 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 262.41 కోట్లు
- 108 అత్యవసర వాహన సేవలు కోసం రూ. 52.94 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 49 కోట్లు.
- 104 మొబైల్ వాహన సేవల కోసం రూ. 36.82 కోట్లు. ళీ కేసీఆర్ కిట్ అమ్మఒడి కోసం రూ. 330 కోట్లు.
- 102 అమ్మ ఒడి పథకానికి రూ. 15 కోట్లు.
- రాష్ట్ర వాటాలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 182 కోట్లు.
- ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలకు రూ.105.65 కోట్లు.ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి గతేడాది మాదిరిగానే రూ. 20 కోట్లతోపాటు నూతన భవన నిర్మాణం కోసం మరో 3 కోట్లు.
- మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు రూ. 10 లక్షలు.
- నిమ్స్‌కు రూ. 3.67 కోట్లు.. ళీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ సేవలకు రూ. 48.15 కోట్లు
- కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 1.60 కోట్లు
- బోధనాసుపత్రుల ఏర్పాటు కోసం రూ. 36.68 కోట్లు ళీమెడికల్ కాలేజీల అభివృద్ధికి రూ. 120.50 కోట్లు
- బోధనాసుపత్రుల నిర్వహణ సేవల సమగ్రాభివృద్ధి కోసం రూ. 40 కోట్లు ళీపార్థివ దేహాలను తరలించే ఉచిత వాహన సర్వీసులకు రూ. 5 కోట్లు
- కోవిడ్ నిర్వహణ కోసం ఆర్థిక సాయం రూ. 92 కోట్లు..
అందుకే విద్య, వైద్యంలో వెనుకబాటు
ఆర్థిక నిపుణులు, పరిశోధకురాలు ఎన్.శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్‌లు ఉండేవి. పంచవర్ష ప్రణాళికలు ఒకటి నుంచి ఐదు వరకు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిల్లోనూ అవే విధా నాలు అమలయ్యాయి. పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్‌లు కూడా అవే ప్రాధాన్యతలను కొనసాగించాయి. ఆర్థికాభివృద్ధి జరిగితే దాని ఫలాలు అందరికీ అంది సామాజిక అభివృద్ధి దానంతటే అదే జరుగుతుందనేది ఆనా టి అభిప్రాయం. అయితే ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ, దాని ఫలాలు అందరికీ అందలేదు. సామాజిక అభివృద్ధి జరగలేదు. ఆరో పంచవర్ష ప్రణా ళికలో సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. దీంతో ప్రణాళికల ఓరియెంటేషన్ మారిపోయింది.
రాష్ట్రాల్లోనూ దానినే అనుసరించారు. దీనిని అన్వయించుకునే క్రమంలో సోషల్ డెవలప్‌మెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ప్రధానం కాగా, కేంద్రం తో సహా రాష్ట్రాలు కూడా వీటిపై దృష్టి పెట్టకుండా ప్రజాకర్షక, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపాయి. దీంతో విద్య, వైద్యం వెనుకబడ్డాయి. ఈ రెండూ అభివృద్ధి చెంది ఉంటే సమాజం తన కాళ్లపై తాను నిలబడేది. అయితే అలా జరగలేదు. ఈ విధంగా రెండు కీలక సందర్భాల్లో జరిగిన పొరపాట్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment