నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఓటాన్ గడువు ముగుస్తుండడంతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కూటమి సర్కార్
ఈ సమావేశాల్లోనూ డైవర్షన్ రాజకీయమే!
గత సమావేశాల్లో జగన్ ప్రభుత్వంపై నిందలతోనే కాలయాపన
జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని మచ్చుకు కూడా ప్రస్తావించని వైనం
బడ్జెట్ సెషన్‌లోనూ అదే రిపీటయ్యే అవకాశం!
సూపర్ సిక్స్‌ను అటకెక్కించి.. ‘అభివృద్ధి’ మాయతో సెషన్‌ను నెట్టుకొచ్చే యత్నం?
సమావేశాలకు దూరంగా వైఎస్సార్‌సీపీ.. మీడియా ద్వారానే నిలదీత
గుంటూరు, సాక్షి: ఏపీలో నేటి(నవంబర్ 11) నుంచి జరగనున్న అసెంబ్లీ ఫుల్ బడ్జెట్ సమావేశాలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. ఏకపక్షంగా సభను నిర్వహించుకుంటున్న కూటమి ప్రభుత్వం.. తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్‌సీపీకి 40% ఓటు షేర్ వచ్చింది. శాసనసభలో అధికార కూటమి, వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉంది. అయినా కూడా ప్రతిపక్షంగా గుర్తించి స్పీకర్ మైకు ఇవ్వడం లేదు. గత సమావేశాల్లోనూ ఇది జరిగింది. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు? అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అన్నారు.
అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రశ్నలు సంధించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్ లంటూ ఆయన వ్యాఖ్యానించారు కూడా.
రెండుసార్లు ఓటాన్!
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
గత సమావేశాల్లో జరిగింది అదేగా..
సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించే లక్ష్యంతో కనిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల వంకతో డైవర్షన్ రాజకీయాన్ని కొనసాగించాలనుకుంటోంది. గత సమావేశాల్లోనూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలతో కాలయాపన చేసింది. శ్వేత పత్రాల పేరుతో హడావిడి చేసింది. ఇక ఇప్పుడు బడ్జెట్‌లోనూ కోతలు, కీలక హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డ్రామాను ప్రదర్శించే అవకాశం లేకపోలేదని అంచనా.
బడ్జెట్ ఇలా..
నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. బడ్జెట్ అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి.
ఇదీ చదవండి: ఏపీలోనూ ‘కోటా’ తరహా ఘటనలు!!
Comments
Please login to add a commentAdd a comment