సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెల్ల రేషన్ కార్డుల జారీపై మంత్రి మాట్లాడారు. ఈ మేరకు ఆహార భద్రతా కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. 23 లక్షల 46 వేలకు మాత్రమే అర్హులని కేంద్రం చెప్పిందన్నారు. 1 కోటి 91 లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో 1 కోటి 73 లక్షల లబ్దిదారులు ఉన్నారని, తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2019లో 3 లక్షల 59 వేల కాత్త కార్డులు ఇచ్చామన్నారు. మెదక్‌లో 7 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, కరోనా వల్ల గత ఏడాది రేషన్ కార్డుల పంపిణి ఆలస్యం అయ్యిందన్నారు. సిద్దిపేటలో 10 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా 7వేల కార్డుల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. నిజమైన ఆర్హులకు అవి ఇస్తామన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 44 వేల కొత్త కార్డులు ఇచ్చామన్నారు. ఇంకా 97 వేల కొత్త కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కరోనా వల్ల కొత్త కార్డులు ఇవ్వలేకపోయామని, పెండింగ్ దరఖాస్తులు అన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఆయన చెప్పారు. అంతేగాక మూడు నెలలు వరుసగా బియ్యం తీసుకొకపోతే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగులా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment